Vishnu Priya: ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన విష్ణు ప్రియ!

Vishnu Priya: విష్ణు ప్రియ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ఈమె పలు బుల్లితెర కార్యక్రమాలతో ప్రేక్షకులను సందడి చేసిన ఈమె అనంతరం బుల్లితెరకు వెండితెరకు దూరమై కేవలం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా చేశారు.ఇలా ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా పెద్ద ఎత్తున అందాలను ఆరబోస్తూ ఈమె చేసే డాన్స్ లు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇలా సోషల్ మీడియాలో తన అంద చందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేసినటువంటి విష్ణు ప్రియ హీరోయిన్ రేంజ్ పాపులారిటీని సొంతం చేసుకుంది.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.ఈ సినిమా అనంతరం ఈమె పలు ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఇకపోతే ఈ పాటలు ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె ఇండస్ట్రీ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా విష్ణు ప్రియ ఇంటర్వ్యూ సందర్భంగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు.ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని అయితే కేవలం ఇండస్ట్రీలోనే మాత్రమే కాదు ఎన్నో కార్పొరేట్ సంస్థలలో కూడా ఈ విధమైనటువంటి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను మహిళలు ఎదుర్కొంటున్నారు అంటూ ఈ సందర్భంగా విష్ణుప్రియ వెల్లడించారు.ఇలాంటి ఇబ్బందులు కేవలం సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయి అనడం పూర్తిగా సరైనది కాదంటూ ఈమె తెలియజేశారు.

ఇకపోతే ప్రతి ఒక్క రంగంలోనే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అయితే మనం ఎంపిక చేసుకునే విధానం బట్టి ఉంటుందని తెలిపారు. ఉదాహరణకు తనకు ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు తాను నిర్మొహమాటంగా నో అని సమాధానం చెబుతా అలా మనం ఎంచుకునే మార్గం బట్టి ఉంటుందంటూ ఈ సందర్భంగా ఈమె క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలియజేశారు. ఇకపోతే ఇండస్ట్రీలో హీరోయిన్ల కన్నా హీరోల డామినేషన్ అధికంగా ఉందని, ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో ఆడవాళ్లు అన్ని రంగాలలోనూ ఉన్నారు. అయితే మునుముందు ఇంకా అన్ని రంగాలలో మగవారితో పాటు ఆడవాళ్లు కూడా సమానంగా ఉంటారని ఈ సందర్భంగా ఈమె కామెంట్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -