Volunteers: ఉద్యోగం ముసుగులో వైసీపీకి సేవ చేస్తున్న వాలంటీర్లు.. నిజమిదేనా?

Volunteers: ఈమధ్య జగన్ తాను అధికారంలోకి వచ్చిన తరువాత లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామంటూ చెప్పుకొస్తున్నారు. అయితే బూతద్దం పెట్టి వెతికినా వాలంటీరు ఉద్యోగాలు తప్పితే వేరే ఏ ఉద్యోగాల నియామకాలు ఈ ఐదేళ్లలో జరగలేదు. ఆ వాలంటీర్లు కూడా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ కేవలం వైసీపీ కార్యకర్తలుగా మాత్రమే పనిచేస్తున్నారు.

 

వాలంటీర్ల పని ప్రజలను ప్రభుత్వ పథకాల పేరుతో బ్లాక్ మెయిల్ చేసి అధికార పార్టీకి అనుకూలంగా మార్చడమే అని ఎప్పటినుంచో ఆరోపణలు వస్తున్నాయి. ఈ వాలంటీర్లు నియామకంలో కూడా మళ్లీ చాలా తేడాలు ఉంటాయి. ఎలాంటి నిబంధనలు లేకుండా వైసీపీ అనుకూలత ఉంటే చాలు వారిని వాలంటీర్ గా నియామకాలు చేపట్టారు. ఈ విషయాన్ని క్యాబినెట్ సహచరులే వేరువేరు సందర్భాలలో బాహటంగా చెప్పారు.

ఎన్నికల విధులలో వాలంటీర్ల సేవలకు అవకాశం లేదని తేలిపోయిన తరువాత జగన్ ఇంత కాలం వాలంటీర్లకు వేసిన ఉద్యోగులు అన్న ముసుగు తీసేసారు. ఇటీవల విశాఖపట్నం జిల్లా సంగివలస లో జగన్ ఎన్నికల ప్రచారానికి శంఖారావం మోగించారు. సిద్ధం పేరుతో బహిరంగ సభ నిర్వహించారు ఈ సభా వేదికగా ఆయన వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేలని, వాళ్ళు మనవాళ్లే అని సగర్వంగా ప్రకటించారు.

 

వాళ్ళు ఇంతకాలం చేసిన సేవ ఇకముందు చేయబోయే సేవ వైసీపీకి అంటూ కుండ బద్దలు కొట్టడాన్ని బట్టి చూస్తే వాలంటీర్నీ వైసీపీ ప్రభుత్వం ఎంతగా వాడుకుంటున్నది మనకి అర్థమవుతుంది. సొంత పార్టీకి లబ్ధి చేకూర్చటానికి ఎన్నికలలో విజయానికి తోడ్పాటు అందించడానికి వాలంటీర్లు నియామకం జరిగిందని ఇంతకాలం విపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజాలు అని స్వయంగా జగన్ అంగీకరించినట్లు అయింది.

 

ఫ్యాక్షన్ లీడర్లు సొంత సైన్యాన్ని మైంటైన్ చేస్తున్నట్లు జగన్ ప్రభుత్వం వాలంటీర్లని మెయింటైన్ చేస్తుంది. అయితే వాళ్ళు తమ సొంత సొమ్ముతో తమ మందిని పోషిస్తే మన జగనన్న మాత్రం ప్రజల సొమ్ముతో వాలంటీర్ సైన్యాన్ని పోషిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -