CM Jagan: ఏపీ ప్రజల కన్నీటిని తుడవాలి.. సీఎం జగన్ కు అర్థమవుతోందా?

CM Jagan: ప్రస్తుతం ఏపీలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అకాల వర్షాల కారణంగా ప్రజలు సర్వం కోల్పోయి బాధపడుతున్నారు. ఈ వర్షాల కారణంగా రైతులకు పంటలకు నష్టం వాటిల్లడంతో రైతులకు తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న కూడా ఏపీ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. అంతేకాకుండా ప్రకృతి పరంగా ఏం జరిగితే తాము ఎలా బాధ్యత వహిస్తాము అన్నది నేరుగానే చెప్పుకుంటోంది. ప్రజల గురించి పట్టించుకోవడం మానేసి ఎంచక్కా రాజకీయ కుట్రలు చేసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వం చేతులెత్తేయడంతో రైతులు అల్లాడిపోతున్నారు.

కొద్ది రోజులుగా ఏపీలో ఊహించని విధంగా అకాల వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఏపీలో పరిస్థితి ఎండాకాలమా లేక వర్షాకాలమా అన్న అనుమానాలు తలెత్తేలా చేస్తోంది. పంటల నష్టంతో లబోదిబోమంటున్నా రైతులను ఓదార్చేవారు పరామర్శించే వారు కూడా లేరు. కనీసం వాతావరణ హెచ్చరికలపై ముందస్తు సూచనలు కూడా చేయకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఏ ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని, ఏడాదికి రూ. ఏడు వేలు ఇచ్చి నట్టేట ముంచేశారు అంటూ రైతులు లబోదిబోమంటున్నారు, మథనపడుతున్నారు.

 

తుపానులు ఆపలేమన్న వ్యవసాయ మంత్రి సాయం చేయకుండా ఎవరు అడ్డుకున్నారు ? తుపానులు ఆపే శక్తి లేదని సముద్రంలో జరిగే వాటిని నియంత్రించలేమని వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి కబుర్లు చెబుతున్నారు. అయితే మందస్తు జాగ్రత్తలు తీసుకోవడం నష్టపోయిన వారికి సాయం అందించకుండా ఎవరు అడ్డుకున్నారన్న ప్రశ్నలు కూడా వినీపిస్తున్నాయి. గత నాలుగేళ్ల కాలంలో ఎన్నో విపత్తులు రైతుల్ని అతలాకుతలం చేశాయి. కానీ ఒక్కసారంటే ఒక్క సారీ కూడా పరిహారం ఇవ్వలేదు. సీఎం సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం కూలిపోతేనే పరిహారం ఇవ్వలేకపోయారు. వారిని రోడ్డున పడేశారు. ఇప్పుడు పరిహారం అంచనా వేస్తున్నామని అదనీ ఇదనీ చెబుతున్నారు. కానీ పరిహారం ఇస్తామని మాత్రం చెప్పడం లేదు. దాంతో ప్రస్తుతం ఏపీలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -