Mega Family: వామ్మో… అప్పట్లో మెగా ఫ్యామిలీలో ఏకంగా అలాంటి గొడవలు జరిగాయా?

Mega Family: ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎవరో ఒకరు గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. మొన్నటి వరకు రామ్ చరణ్ ఉపాసన పేర్లు హాట్ టాపిక్ గా మారగా, ఇప్పుడు నిహారిక పేరు హాట్ టాపిక్ గా మారింది. ఇలా ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉన్నారు మెగా ఫ్యామిలీ. ఇది ఇలా ఉంటే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక విషయాన్ని వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే.. రామ్ చరణ్ చిన్నప్పుడు తన అక్క సుస్మితతో తరచూ పోట్లాడుతూనే ఉండే వారట.

సుస్మిత ఏ బొమ్మ తీసుకుంటే ఆ బొమ్మ కావాలని సుస్మిత ఏ వస్తువు అడిగితే అదే వస్తువు కావాలని చాలా మొండి చేసేవాడట. ఈ క్రమంలోనే పవర్ స్టార్ తాను ( పవన) సరదాగా వీళ్లిద్దరిని ఏడిపించిన మూమెంట్స్ కూడా ఎన్నో ఉన్నాయి అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు పవన్. అలాగే చిన్నతనంలో రామ్ చరణ్ కు సుస్మితకు గొడవలు పెట్టింది నేనే అంటూ చాలా ఫన్నీగా చెప్పుకొచ్చారు. చిరంజీవి ఇంట్లోనే పవన్ కళ్యాణ్ ఉండేవాడు అని అందరికీ తెలిసిందే. అయితే సినిమాల్లోకి రాకముందు పిల్లల బాగోగులు చూసుకునేది పవన్ కళ్యాణ్.

 

కాగా ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ కొన్ని సార్లు సరదాగా టైం పాస్ అవడం కోసం పిల్లల్ని ఆటపట్టించడం కోసం చరణ్ వద్దకు వెళ్లి సుస్మిత నీ గురించి మమ్మీతో ఇలా చెప్తుంది. నువ్వు బ్యాడ్ బాయ్ పనులు చేస్తున్నావంటూ కంప్లైంట్ ఇస్తుంది అంటూ చెప్పుకు వచ్చేవారట. అదే క్రమంలో సుస్మిత వద్దకు వెళ్లి నువ్వు ఇంత బ్యాడ్ గర్ల్ నా? ఇలాంటి పనులు చేస్తున్నావా? మమ్మీకి నీ గురించి చరణ్ చెప్తున్నాడు అంటూ చెప్పేవారట. వారిద్దరి మధ్య నేను కూడా ఎన్నోసార్లు చిన్న చిన్న గొడవలు సృష్టించాను అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. కొన్ని కొన్ని సార్లు జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకునే స్థాయికి కూడా వెళ్ళిపోయారట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -