AAA: వామ్మో.. బన్నీ మల్టీప్లెక్స్ కోసం అన్ని రూ.కోట్లు ఖర్చు చేశాడా?

AAA: సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు బిజినెస్‌లోనూ రాణిస్తున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు బిజినెస్‌లు చేస్తూ దూసుకెళ్తున్నారు. హోటల్స్, రెస్టారెంట్స్, ఇతర వాణిజ్య రంగాల్లో వ్యాపారాలు చేస్తూ రాణిస్తున్నారు. అయితే టాలీవుడ్‌లో చాలా మంది హీరోలకు సొంతంగా థియేటర్లు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు థియేటర్లు నిర్మించుకుంటున్నారు. ఇటీవల మహేష్ బాబు కూడా ఏసియన్ వాళ్లతో కలిసి ఓ పెద్ద మల్టీఫ్లెక్స్ ను నిర్మించారు. ఈ థియేటర్ గచ్చిబౌలిలో ఉంది. దాదాపు ఏడు స్క్రీన్లతో భారీ థియేటర్ ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ థియేటరే నంబర్ వన్ పొజిషన్‌లో కొనసాగుతోంది.

ఈ క్రమంలో చాలా మంది హీరోలతో ఏసియన్ యాజమాన్యం డీల్ కుదుర్చుకుంటున్నారు. తమతో కలిసి థియేటర్ల నిర్మించుకునేలా.. స్టార్ హీరోలను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. విజయ్ దేవరకొండతో కలిసి ఇప్పటికే ఓ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్‌లో ‘ఏవీడీ’ పేరుతో థియేటర్‌ నిర్మించారు. ఏవీడీ అంటే.. విజయ్ దేవరకొండ మాట్ అండ్ మల్టీఫ్లెక్స్ అని పలువురు చెబుతున్నారు. అలాగే ఇప్పుడు అదే ఏసియన్ సంస్థతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ఓ మల్టీఫ్లెక్స్ ఏర్పాటు చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో థియేటర్ ఉండనుంది. దీనికి ఏఏఏ అని నామకరణం పెట్టనున్నారు. ఏఏఏ అనగా.. ‘అల్లు అర్జున్ మాల్ అండ్ మల్టీఫ్లెక్స్’. అయితే ఈ మల్టీఫ్లెక్స్ నిర్మాణంలో ఇద్దరి పేరిట ఉమ్మడి ఆస్తిగా ఉండనున్నట్లు సమాచారం. త్వరలో థియేటర్ ఓపెన్ కానున్నట్లు సమాచారం. సంక్రాంతి పండుగ వరకు మల్టీఫెక్స్ ను ఓపెన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరై.. మల్టీఫ్లెక్స్ ను ప్రారంభం చేయనున్నారు. ఈ మల్టీఫ్లెక్స్ ను బన్నీ టేస్ట్ కు తగ్గట్లుగానే నిర్మించినట్లు తెలుస్తోంది. ఇంటీరియల్ డిజైన్స్ కు రూ.75 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. అయితే ఏసియన్ సంస్థ.. టాలీవుడ్ స్టార్ హీరోలతో చేతులు కలిపి థియేటర్లు ఏర్పాటు చేస్తోంది. భవిష్యత్‌లో మరిన్నీ మల్టీఫ్లెక్స్ ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -