Prashanth Neel-NTR: వామ్మో.. ప్రశాంత్ మూవీ తారక్ పాత్ర ఇలా ఉంటుందా?

Prashanth Neel-NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన నటన, డ్యాన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అతి తక్కువ మంది హీరోల జాబితాలో నందమూరి వారసుడు తారక్ ముందుంటాడు. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తారక్.. ‘ఆర్ఆర్ఆర్’తో తన కెరీర్ ని పీక్ కు తీసుకెళ్లాడు. మరీ ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’లో అతడు చేసిన ‘కొమురం భీముడో’ పాటలోని నటన జనాలు ఫిదా అయిపోయారు.

 

ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివతో కలిసి సినిమా చేస్తున్న యంగ్ టైగర్.. అది ముగిసిన తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ‘సలార్’ సినిమా చేస్తుండగా.. అది ముగిసిన తర్వాత ఎన్టీఆర్ తో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ సినిమా మీద అప్పుడే విపరీతమైన బజ్ క్రియేట్ అయింది.

 

ప్రతి సీన్ ని పండేలా చేసే యాక్టర్ అయిన తారక్.. ప్రేక్షకులకు ఎలాంటి సీన్ కావాలో బాగా తెలిసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా అంటే మామూలుగానే భారీ అంచనాలు ఉంటాయి. అదే తరహాలో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశం మీద ఫ్యాన్స్ తో పాటు సగటు తెలుగు ప్రేక్షకుడు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తుండగా.. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని లీక్స్ అందరిలో ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి.

 

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ చేస్తున్న సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో హీరో బొగ్గు గనుల్లో కార్మికుల కోసం ఎన్టీఆర్ రక్తం చిందించే పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సీన్లను వేరే లెవల్ లో చూపించే ప్రశాంత్ నీల్.. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఎవరూ ఊహించని స్థాయిలో చూపించబోతున్నాడని.. తారక్ పాత్ర చూసిన జనాలకు రోమాలు నిక్కబొడుచుకుంటాయనే వార్త ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -