BRO: ఈ బుకింగ్స్ ఏంటి బ్రో.. ఆ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమైందంటూ?

BRO: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుంది అంటే ఆయన సినిమాలకు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో మనకు తెలిసిందే.ఈ విధంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు టికెట్స్ బుకింగ్ ఓపెన్ అయితే బుక్ మై షో దరిల్లిపోతుంది క్షణాల్లో టికెట్లు మొత్తం సేల్ అవుతూ ఉంటాయి. అలా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ క్రేజ్ సొంతం చేసుకున్నారు కానీ బ్రో సినిమా విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ నటించిన బ్రో సినిమా ఈనెల 28వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే బుకింగ్స్ ఓపెన్ చేయగా పెద్దగా టికెట్స్ మాత్రం బుక్ అవడం లేదని తెలుస్తుంది. ప్రసాద్, ఎఎఎ, ఎఎంబి లాంటి చోట్ల తప్ప మిగిలినవి చాలా స్లోగా కట్ అయ్యాయి. బుధవారం సాయంత్రానికి మెల్లగా ఫుల్స్ కనిపించడం ప్రారంభమైంది.అయితే విడుదల రోజు పూర్తయినప్పటికీ శని ఆదివారాలు మాత్రమే ఇంకా టికెట్స్ అలాగే ఉండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం బ్రో అయితే ఈ సినిమాపై ప్రేక్షకులు పెద్దగా అంచనాలు పెట్టుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఓజీ, ఉస్తాద్ సినిమాలపై అంచనాలు ఉన్నాయి. కానీ బ్రో సినిమాపై ఎలాంటి అంచనాలు లేకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ సినిమా విషయంలో పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.

 

చిన్న సినిమాలకి మొదటి మూడు రోజులు టికెట్స్ బుక్ అవుతాయి అలాంటిది పవన్ కళ్యాణ్ సినిమాకు టికెట్స్ అలాగే ఉండడంతో అసలు ఇదేంటి అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. సినిమా విడుదలై బాగుంది అనిపించుకుంటే కలెక్షన్ల పరంగా ముందుకు వెళుతుంది ఇలాంటి ఓపెనింగ్ అంటే బయ్యర్ కు కాస్త కష్టమే. భీమ్లా నాయక్ సినిమా నైజాం 27 కోట్ల వరకు వసూళ్లు సాగించింది.బ్రో సినిమా 33 కోట్ల మేరకు వసూలు చేయాల్సి వుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -