Jagan: ఇలా చేస్తున్నావ్ ఏంటి జగన్.. ప్రజల సమస్యలు అర్థం కావట్లేదా?

Jagan: 2019 ఎన్నికల సమయంలో జనంలోకి వెళ్లి ధైర్యంగా మాట్లాడి హామీలను ఇచ్చిన జగన్ ఇప్పుడు జనంలోకి వెళ్లాలి అంటేనే భయపడుతున్నాడు. కనీసం జగన్ జనంలోకి వెళ్లే ఆలోచన కూడా చేయడం లేదు. జనంలోకి వెళితే ప్రజలు నిలదీస్తారు అన్న టెన్షన్, భయం జగన్ కి మొదలైంది. అయితే పోలీసు ప్రొటెక్షన్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ జనం అసహనంతో ఉన్నారని ఈ సమయంలో జనంలోకి వెళితే నిలదీస్తారు అన్న భయం జగన్ ను వెంటాడుతోంది. ఇందుకోసం జగన్ ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజా దర్బార్ లాంటివి ఏమి పెట్టకుండా ఒక కాల్ సెంటర్ పెడదామని నిర్ణయించుకున్నారు.

ఇక ఆ కాల్ సెంటర్ కు జగనన్నకు చెప్పుకుందాం అని ప్రచారం కూడా చేసుకున్నారు. అలాగే ఇటీవలె ఇదిగో ప్రారంభిస్తున్నాం అని తేదీ ని కూడా ప్రకటించారు. ఏప్రిల్ 13 అన్నారు. ఏప్రిల్ 30 వస్తోంది. కానీ దాని గఊసే ఎత్తడం లేదు. జగనన్నకు చెప్పుకుందాం అనే కాల్ సెంటర్ కాన్సెప్ట్ ను బెంగాల్ నుంచి తీసుకు వచ్చారు. దీదీకో బోలో అని ఐ ప్యాక్ బెంగాల్ లో నిర్వహించిన కాల్ సెంటర్ తరహా వ్యవస్థ. సమస్యలు చెప్పుకుంటే ప్రభుత్వం దృష్టిలో ఉందని మంచి చేస్తుందన్న నమ్మకంతో రిజిస్టర్ చేసుకున్న వారంతా ఓట్లు వేస్తారన్న లక్ష్యంతో అక్కడ ప్రారంభించారు.

 

కానీ ఏపీలో ప్రభుత్వం అనేక హామీల్ని ఇచ్చింది. వాటిని పరిష్కరిచమనే కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తారు. అయితే అవన్నీ నేరుగా సీఎం జగన్ ఇచ్చినవి. జగన్ ఆ కాల్ సెంటర్ గురించి పట్టించుకోకపోవడంతో జగన్ కు కాల్ సెంటర్ పెట్టడం చేతకాదా, జనంలోకి వెళ్లడానికి మాత్రమే కాకుండా జనంతో మాట్లాడడానికి కూడా జగన్ భయపడుతున్నారా అలాంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం జగన్ కి ప్రజల సమస్యలు అర్థం కావడం లేదు. ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు చెవిన చేసుకోవడం లేదు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -