KCR: దళితబంధు స్కీమ్ పరువు తీసిన కేసీఆర్.. ఏం చెప్పారంటే?

KCR: తెలంగాణలో దళితులను ఆర్థికంగా ఆదుకోవడానికి బిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ పథకం ద్వారా దళితులు మాత్రం లబ్ధి పొందటం లేదు. దళితుల పేరుని అడ్డుపెట్టుకొని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు దళిత బంధు పథకం ద్వారా వచ్చే డబ్బుని ప్రజలకు ఇవ్వకుండా నొక్కేస్తున్నారని ఇప్పటికే ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

ఈ క్రమంలో తాజాగా టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ చేసిన వ్యాఖ్యల వల్ల ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలలో నిజం ఉందని ధ్రువీకరించినట్లు అయింది. అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల హైదరాబాద్‌లో కెసిఆర్ ప్రజా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ సమావేశంలో దళిత బంధు పథకం ద్వారా వస్తున్న నిధులను నొక్కేస్తున్న ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద ఉందని, ఇకనైనా వారు తమ తీరు మార్చుకోకపోతే తోకలు కత్తిరించేస్తానంటూ హెచ్చరించారు.

 

అంతే కాకుండా సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఆ జాబితాలో ఉన్నట్లు కెసిఆర్ తెలిపాడు. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమనేలా కేసీఆర్ ఇలా దళిత బంధు పథకం గురించి నోరు జారటంతో మండిపడుతున్నాయి. దళిత బంధు పథకం ద్వారా దళితులకు చేరాల్సిన సొమ్ముని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి కార్యకర్తలు నొక్కేస్తున్నారని కేసీఆర్‌ స్వయంగా గుర్తించినప్పుడు వారిపై చర్యలు తీసుకోకుండా హెచ్చరికలతో సరిపెట్టడం సరి కాదని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.

 

దళితుల నోటి కాడ కూడు లాగేసుకొంటున్న ఆ ఎమ్మెల్యేల పేర్లను బహిర్గతం చేసి వారిని పార్టీ నుంచి తొలగించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. లేని యెడల తామే కోర్టును ఆశ్రయించవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే దళితబంధులో అక్రమాలను అరికట్టలేకపోతే ఇక జాతీయస్థాయిలో ఎలా అరికట్టగలరు? అంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -