Bunny-Sneha Reddy: బన్నీ స్నేహారెడ్డి మధ్య ఆ విషయంలో గొడవలా.. ఏం జరిగిందంటే?

Bunny-Sneha Reddy: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ క్యూట్ కపుల్ అల్లు అర్జున్ స్నేహ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో వీరు కూడా ఒకరు. అల్లు అర్జున్ సినిమాలలో నటించి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. స్నేహ రెడ్డి ఇంట్లోనే ఉంటూ పిల్లల బాధ్యతలను చూసుకుంటోంది. అయితే ఈ మధ్య కాలంలో స్నేహ రెడ్డి హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా రెడీ అవుతూ హాట్ ఫోటోషూట్లు చేస్తోంది. కాగా తాజాగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ స్నేహ రెడ్డికి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది.

 

అదేమిటంటే అల్లు అర్జున్ లో స్నేహ రెడ్డి ఒక క్వాలిటీ అంటే చాలా చిరాకట. దాంతో ఎప్పుడైనా సరే అలా చేస్తే స్నేహారెడ్డి,అల్లు అర్జున్ తో రెండు రోజులు మాట్లాడదట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. అల్లు అర్జున్ ఎప్పుడు నవ్వుతూ తన చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ ఏ విషయాన్ని అయినా కూడా మనసులో దాచుకోకుండా బయటకు పెట్టేస్తూ ఉంటాడట. పర్సనల్ విషయాలను కూడా ఏది దాచి పెట్టుకోకుండా ఓపెన్ గా మాట్లాడేస్తూ ఉంటారట. ఈ క్రమంలోనే ఇటీవల అల్లు అర్జున్ ఒక ఈవెంట్లో పాల్గొంటూ తన ఫస్ట్ లవ్ గురించి ఓపెన్ అప్ అయిపోయాడు.

అయితే మాములుగా స్నేహారెడ్డి చాలా రిజర్వుడ్ గా ఉంటుందట. బన్నీ అందుకు పూర్తిగా అపోజిట్ గా ఉంటాడట. అయితే కొన్ని కొన్ని సార్లు షోస్ లో కామెడీగా సెటైరికల్ గా హీరోయిన్స్ పై కామెంట్స్ చేయడం పర్సనల్ విషయాలను బయట పెట్టడం స్నేహారెడ్డికి అస్సలు ఇష్టం లేదట. ఈ మధ్యకాలంలో ఆహాలు సింగింగ్ కాంపిటీషన్లో తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పినందుకు అల్లు అర్జున్ తో ఏకంగా రెండు రోజులు మాట్లాడలేదట స్నేహ రెడ్డి. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -