Devara: దేవర మూవీలో ప్రేక్షకులకు కిక్కిచ్చే సీన్లు అవే.. ఏమైందందే?

Devara: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా ‘దేవర’. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇదే. కొరటాల శివ, ఎన్టీఆర్ డైరెక్షన్‌లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుci వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా దేవర సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే.. దేవర సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఉంటుందట. ఫ్లాష్‌బ్యాక్ సెకండాఫ్‌లో వస్తుందట. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో ఎన్టీఆర్ చాలా రఫ్ అండ్ టఫ్‌గా ఉంటారని, ఈ క్యారెక్టర్ చాలా వైల్డ్‌గా ఉంటుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భారీ యాక్షన్ సీన్లు ఇందులో ఉంటాయని, ఫ్యాన్స్‌కు రోమాలు నిక్కపొడుచుకునేలా ఇవి ఉంటాయని చెబుతున్నారు. ఇవి థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని టాలీవుడ్ సర్కిల్స్‌లో గుసగుసలాడుకుంటున్నారు. అలాగే సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ సీన్లు విజువల్ వండర్‌గా కూడా నిలుస్తాయట. అందమైన లొకేషన్లలో వీటిని చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. మాములుగా కొరటాల సినిమాల్లో యక్షన్ సీన్లు ఉంటాయి తప్ప భీభత్సంగా ఏమీ ఉండవు, కానీ ఇందులో యాక్షన్ సీన్లను ఒక రేంజ్‌లో తెరకెక్కించనున్నట్లు యూనిట్ చెబుతోంది.

 

అయితే దేవర సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి వెళ్లింది. బాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ క్రేజ్ పెరిగింది. దీంతో ఇక నుంచి ఎన్టీఆర్ సినిమాలను పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ కసరత్తులు చేయనున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -