Shyam: ఏపీలో ఏం జరుగుతోంది.. శ్యామ్ ఆత్మహత్యకు కారణమిదేనా?

Shyam: ఏపీలో లాండ్ అండ్ ఆర్డర్ దెబ్బతిందని ప్రతిపక్షాలు గొంతెత్తి ఆరోపిస్తున్నారు. రోజుకో మర్డర్ వారానికో హత్య జరుగుతోందని వైసీపీపై దుమ్మెత్తి పోస్తున్నారు. వైసీపీ సైకో పాలన పోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మృతి అత్యంత కలకలం సృష్టించింది. అసలు ఈ శ్యామ్ ఎవరు, ఎలా మృతి చెందాడంటే..?

 

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్యామ్ అనే యువకుడు, జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత వీరాభిమాని. తారక్ అంటే ఆ అబ్బాయికి చచ్చేంత ప్రేమ. ఒకసారి ఆడియో ఫంక్షన్ తారక్ బౌన్సర్లని దాటుకొనిపోయి, ఆయన్ని హగ్ చేస్తున్నాడు. ఈ మృతిపై సంతాపం ప్రకటించిన జూనియర్ ఎన్టీఆర్, సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు టీడీపీ ఈ అనుమానాస్పద హత్యపై తీవ్ర ఆందోళన చేస్తోంది.

రోజు అందరితో తిరిగుతూ, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్యామ్ ఊరి వేసుకొని కనిపించటం కలకలం రేపుతోంది. మొదట ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ శ్యామ్ మృతదేహం ఫోటో బయటపడిన తర్వాత అనేక అనుమానాలు బలపడుతున్నాయి. ఉరి వేసుకున్న ఆనవాళ్లు లేకపోగా చేతులకు గాయాలున్నాయి. అలాగే నోట్లో గంజాయి ని పెట్టి ఉన్నారు. గంజాయి నోట్లో కుక్కినట్లు ఉండటం కూడా తీవ్ర అనుమానాలుకు దారి తీస్తోంది.

 

చేతికి కత్తిరించిన గాయాలు ఉండటంతో ఇది ఆత్మహత్య కాదని సోషల్ మీడియాలో పోలీసుల్ని ప్రశ్నించడం ప్రారంభించారు. గ్రామంలో వైసీపీ కార్యకర్తలతో జరిగిన గొడవల తర్వాతే శ్యామ్ చనిపోయాడన్న ప్రచారం ప్రారంభం కావడంతో విషయం రాజకీయ దుమారం రేగింది. యువకుడి మరణంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. #WeWantJusticeForShyamNTR హ్యాగ్ ట్యాగ్ పేరుతో వైరల్ చేస్తున్నారు.

 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతోపాటు ఆ పార్టీ నాయకులు కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. పోలీసులు నిష్ఫాక్షిక విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -