Bunny: బన్నీ స్టార్ కావడం వెనుక ఇంత కష్టం ఉందా?

Bunny: పుష్ఫ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా బన్నీ కొత్త అవతారం ఎత్తాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా, ఐకాన్ స్టార్ గా అల్లుఅర్జున్ మారారు. అయితే కెరీర్ ఆరంభంలో ఆయన హీరో కాలేడని చాలా మంది విమర్శించేవారు. గంగోత్రి సినిమా విడుదల సమయంలో ఆయనపై పలువురు నోరుమెదిపారు. అల్లుఅర్జున్ కు స్టార్ హీరో అయ్యే అర్హతలు లేవని కామెంట్లు చేశారు. వారందరి నోర్లూ మూయిస్తూ బన్నీ నిలకడగా రాణించారు. వరుస విజయాలతో స్టార్ హీరోగా నిలబడ్డారు.

 

అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్, కోలీవుడ్ లో బన్నీ తన నటనతో ఆకట్టుకున్నారు. పుష్ప ది రైజ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాన్ ఇండియా లెవల్లో ఆయన పాపులారిటీని సొంతం చేసుకున్నారు. తగ్గేదేలే అనే ఒక్క డైలాగ్ తో బన్నీ దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. నెట్టింట బన్నీ అభిమానుల సంఖ్య కూడా అమాంతం పెరిగింది.

 

పాన్ ఇండియా పుష్పరాజ్‌ గా బన్నీ 2022లో కొత్త అవతారం ఎత్తాడు. ఈ ఏడాదిలో నేషనల్‌ లెవల్‌లో ఎక్కువ వ్యూస్‌ సాధించిన సాంగ్స్‌ బన్నీ సినిమాలోవి కావడం విశేషం. టాప్‌ టెన్‌ యూట్యూబ్‌ ట్రెండింగ్ వీడియోస్‌ లిస్ట్‌లో 4 పాటలు పుష్ప సినిమాలోవే. అంతేకాదు బన్నీ డైలాగులను ప్రముఖ క్రికెటర్లు, సెలబ్రిటీలు సైతం చెప్పి ఫేమస్ అయ్యారు.

 

సుకుమార్ దర్శకత్వంలోనే హీరో అల్లు అర్జున్ చేసిన ఆర్య, ఆర్య2 సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ తర్వాత దేశముదురు సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురం వంటి సినిమాలతో అల్లుఅర్జున్ భారీ హిట్లు అందుకున్నారు. అటు మాస్ హీరోగా, ఇటు యాక్షన్, డ్యాన్స్, ఫ్యామిలీ, సెంటిమెంట్ హీరోగా ప్రేక్షకుల మదిలో బన్నీ స్థానాన్ని సంపాదించుకున్నాడు. అనేక కష్టాలు పడి స్టార్ హీరోగా నిలిచాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -