AP Transport Department: ఏపీ రవాణా శాఖ నిర్ణయంలో అసలు నిజమిదే.. ఏమైందంటే?

AP Transport Department: ఏమాత్రం అవకాశం దొరికిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై విమర్శలు చేయడానికి సోషల్ మీడియా బ్యాచ్ సిద్ధంగా ఉంటుంది. ఈ క్రమంలోని ఇప్పటికే ఎన్నో ఆధారాలు లేనటువంటి విమర్శలు చేస్తూ చివరికి వాళ్లే విమర్శలు పాలయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఓ తప్పుడు కథనంతో సోషల్ మీడియా బ్యాచ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏపీలో రోడ్డుపై ప్రయాణించేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని ప్రయాణం చేస్తే 20000 చలన కట్టాల్సిందేనంటూ ఓ వార్త హల్చల్ చేస్తోంది.

ఈ విధంగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే 20000 రూపాయలు జరిమానా విధిస్తే సామాన్యుడికి ఇది ఎంతో భారం అవుతుందని చాలామంది ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తూ కామెంట్లు చేశారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా విమర్శలు కురిపించారు. తాజాగా ఈ వార్తలపై ఏపీ రవాణా శాఖ కమిషనర్ స్పందించారు.

 

హెడ్ ఫోన్స్ పెట్టుకొని ప్రయాణం చేస్తే 20,000 జరిమానా అంటూ వస్తున్నటువంటి ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగానే రాష్ట్రంలో జరిమానాలు విధిస్తున్నట్టు కమిషనర్ ప్రకటించారు. ఇలా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ప్రయాణం చేసే వారికి మొదటిసారి 1500 నుంచి 2000 వరకు జరిమానా ఉంటుంది. అయితే ఇలా మరోసారి కనుక కనపడితే పదివేల వరకు జరిమానా ఉంటుందని రవాణా శాఖ కమిషనర్ తెలిపారు.

 

ఇక ఈ నిబంధనలు ఎప్పటినుంచో ఆములలో ఉన్నాయి కొత్తగా అమలులోకి తీసుకొచ్చినది కాదు అంటూ రవాణా శాఖ కమిషనర్ ఈ సందర్భంగా తెలియజేయడంతో సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వస్తున్నటువంటి ఈ వార్తలకు పూర్తిగా చెక్ పడింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -