Sleep: ప్రశాంతమైన నిద్ర రావాలంటే ఏం చేయాలో తెలుసా?

Sleep: మనిషి రోజంతా ఉల్లాసం, ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం రోజూ 8 గంటలు నిద్రపోవాలి. సరైన నిద్ర లేకపోతే ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. పూర్వ కాలంలో ఉదయం అంతా కష్టపడి ఇంటికి వచ్చినవారు సాయంత్రం 7 గంటల భోజనం చేసి 8 వరకు నిద్రలోకి జారుకునేవారు. మళ్లీ ఉదయమే 5 గంటల కల్లా నిద్రలేచి వారివారి పనుల్లో నిమగ్నమవుతారు. అప్పుడు కష్టంతో పాటు తగిన విశ్రాంతి కూడా తీసుకునేవారు కాబట్టి అప్పటి వాళ్లు ఆరోగ్యంగా ఉండేవారు. దాంతో పాటు పౌహికాహారం కూడా తీసుకోవడంతో నిత్యం ఆరోగ్యంగా ఉండేవారు.

ప్రస్తుతం కాలం మారిపోయింది. ఆహారపు అలవాట్లు మారిపోయాయి. మనుషులు కాలం వెంట పరుగెడుతున్నారు. ఆఫీస్‌లో కంప్యూటర్ల ముందు గంటలకొద్దీ గడిపి కూడా ఇంటికి వచ్చాకా టీవీ.. మొబైల్‌ ఫోన్లతో బిజీ అయిపోతున్నారు. రాత్రిళ్లు 11 లేదా 12 గంటలు దాటితే గాని నిద్రపోరు. పడుకున్నా… ఉదయాన్నే ఆఫీసులకు పోవాలి కాబట్టి.. ఉదయం 6 లేదా 7 గంటలకు నిద్ర లేస్తారు. అంటే వారు నిద్రపోయే సమయం కేవలం 6–7 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. సరైన నిద్ర లేకపోతే ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. కనీసం 6 గంటలైనా ప్రశాంతంగా నిద్రపోవాలంటున్నారు వైద్య నిపుణులు.

ఇవి పాటించండి..

1. పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే నిద్ర బాగా పడుతుంది. పాలలో ఉండే న్యూరో ట్రాన్స్‌మీటర్స్‌ ఇవి మనసుకు ప్రశాంతతను చేకూర్చడంతో పాటు హాయిగా నిద్రపోయేలా చేస్తాయి.

2. పడుకునే ముందు గ్రీన్‌ టీ తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒత్తిడి, ఆందోళన తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది. దీనివల్ల హాయిగా నిద్రపోవచ్చు.

3. రాత్రి భోజనంలో మజ్జిగ తీసుకోవడం ద్వారా కూడా చక్కగా నిద్ర పడుతుంది. మజ్జిగలో ఉండే ట్రిప్టోఫాన్‌ నిద్రను ప్రేరేపిస్తుంది.

4. రాత్రిపూట అరటిపండు తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా పెరిగి ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఫలితంగా మంచి నిద్ర వస్తుంది.

4. బాదం పప్పు తీసుకోవడం కండరాలు, మనసు రిలాక్స్‌ అవుతాయి. తద్వారా చక్కని నిద్ర పోవడానికి అవకాశం ఉంటుంది.

5. పడుకునే ముందు చెర్రీపండ్లు తిన్నా లేదా జ్యూస్‌ తాగినా.. అందులో ఉండే ’మెలటోనిన్‌’ వల్ల హాయిగా నిద్ర వస్తుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -