KCR: కేసీఆర్ ఉగ్రరూపం చూపించాడుగా.. ఆ ఎమ్మెల్యేలు వణికేలా?

KCR: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ 50 మంది ఎమ్మెల్యేల పవర్స్ ని కట్ చేసినట్టుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. సంక్షేమ పథకాల్లో అవినీతికి పాల్పడుతూ ప్రభుత్వంపై అసంతృప్తి పెంచుతున్నారన్న ఆగ్రహంతో దాదాపుగా యాభై మంది ఎమ్మెల్యేల పవర్స్ ను సీఎం కేసీఆర్ కట్ చేసినట్లుగా ప్రస్తుతం బీఆర్ఎస్‌ లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇటీవల కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యేల తీరుపై నేరుగానే మండిపడ్డారు కెసిఆర్. అయితే ఆ విషయం కాస్త బయటకు రావడంతో రాజకీయంగా గందరగోళం ఏర్పడింది.

అయినా కేసీఆర్ ఆ ఎమ్మెల్యేలను ఉపేక్షిస్తే మొదటికే మోసం వస్తుందని కొత్త తరహా చర్యలు తీసుకున్నారు. ఆ యాభై మంది ఎమ్మెల్యేలతో పాటు కొంత మంది నియోజకవర్గ ఇంచార్జులకు ఇక నుంచి సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధిదారుల ఎంపికలో జోక్యం లేకుండా చేశారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా చోట్ల ఎమ్మెల్యేలు, నాయకుల ప్రమేయం లేకుండా చేయాలని నిర్ణయానికి వచ్చారు. అంతేకాకుండా అధికారులతో పాటు ఆ నేతలకు పరోక్షంగా కూడా సంకేతాలు ఇచ్చారు. జోక్యం చేసుకోవద్దని పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజక వర్గాల ఇంచార్జి ల ద్వారా అధినేత ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

 

లబ్దిదారుల ఎంపిక బాధ్యతను కేసీఆర్ గతంలో ఎమ్మెల్యేలకు ఇచ్చారు. అయితే ఈ అవకాశాన్ని ఆసరా చేసుకుని అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఒక్కో దళితబంధు లబ్ధిదారుడి నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు చేశారని, కొన్ని సంఘటన లను ఉటంకిస్తూ అధినేత వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజల్లో వ్యతిరేకత తెచ్చే ప్రమాదం ఉండటంతో పార్టీ పరంగా కఠిన నిర్ణ యాలు తీసుకోవడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే 50 మంది ఎమ్మెల్యేలకు కేసీఆర్ షాక్ ఇస్తూ అలా పవర్స్ కట్ చేయడంతో ఆ 50 మంది ఎమ్మెల్యే లు ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడ్డారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -