Sharmila: ఆ ఊపు ఎక్కడ షర్మిల.. ఇలా ఉంటే పార్టీకి కష్టమే!

Sharmila: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పార్టీని ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ పార్టీని ప్రారంభించిన ఈమె ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ రాజకీయాలను ప్రారంభించారు. ఇటీవల తెలంగాణ నిరుద్యోగుల సమస్యపై ఇతర ప్రతిపక్షాలను కూడా కలుపుకొని ఈమె అధికార ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం మనకు తెలిసిందే.

ఇక తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని శపథం చేసిన షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. అయితే ఈ పాదయాత్రలో ఈమెకు అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యాయి. అలాగే ఈమె అధికారపక్షంపై తీవ్రస్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేయటం వల్ల పోలీసులు ఈమె పాదయాత్రను అడ్డుకోవడం జరిగింది. అయితే శతవిధాలుగా ప్రయత్నించి పాదయాత్ర అనుమతి తీసుకున్నప్పటికీ ఈమె అధికార పక్ష నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో అసలు సమస్య ఏర్పడింది. దీంతో పాదయాత్ర కూడా ఆగిపోయింది.

 

తెలంగాణలో ఎలాగైనా రాజన్న రాజ్యాన్ని తీసుకువస్తానని చెప్పినటువంటి ఈమె ఈ ఏడాది ఆఖరిలో ఎన్నికలు వస్తున్న సమయంలో ప్రస్తుతం మౌనం వహిస్తున్నారు.ఇలా ఎన్నికలు సమీపిస్తున్న వేళ షర్మిల మౌనం వెనుక ఉన్న కారణం తెలియదు కానీ ఈమె ప్రస్తుతం మౌనం వహించడంతో ఎన్నో ఊహగానాలు ఎదురవుతున్నాయి.పార్టీ పెట్టిన మొదట్లో షర్మిల లో కనిపించిన ఉత్సాహం ఆ వాడి వేడి ప్రస్తుతం కనిపించడం లేదని తెలుస్తుంది.

 

షర్మిల మౌనం వెనుక కారణాలు ఏంటి అని ఆరా తీస్తున్నారు. బహుశా ఆమె పార్టీకి తెలంగాణలో సరైన ఆదరణ లేకపోవడం వల్లే ఇలా నిరుత్సాహానికి గురై మౌనం వహిస్తున్నారా లేకపోతే తన వ్యక్తిగత కారణాలవల్ల పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారా అనే విషయాలు తెలియడం లేదు. ఎన్నికల సమీపిస్తున్న వేళ షర్మిల ఇలా మౌనం వహించడంతో ఇలాగైతే తెలంగాణలో తన పార్టీని ముందుకు తీసుకురావడం కష్టమేనంటూ పలువురు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -