YS Jagan: మోదీని కలుస్తారు.. అమిత్ షాను జగన్ కలవరెందుకు?

YS Jagan: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పట్ల జగన్ తీరు మరోసారి డిబేట్ గా మారింది. అమిత్ షా పట్ల ఎప్పుడు జగన్ తీరు వివాదాస్పదంగా ఉంటుంది. మోదీ పట్ల ఉన్న గౌరవం, సానుకూత అమిత్ షా పట్ల జగన్ కు అసలు ఎప్పుడూ ఉండదు. మోదీకి ఇచ్చినంత విలువ అమిత్ షాకు జగన్ ఇవ్వరు. జగన్ ఢిల్లీ పర్యటనల సమయంలోనూ ఈ విషయం బయటపడుతూ ఉంటుంది. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులతో జగన్ భేటీ అవుతూ ఉంటారు.

కానీ కేంద్ర హెంమంత్రి అమిత్ షాను మాత్రం కలవరు. ఇది ఎందుకనేది పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. జగన్ కు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని చాలాసార్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఎవరినైనా కలవాలంటే ముందుగా అపాయింట్ మెంట్ తీసుకుని వెళతారు. కానీ అమిత్ షాకు జగన్ అపాయింమెంట్ ఇవ్వరా.. లేక జగన్ నే అమిత్ షా అపాయిమెంట్ తీసుకోరా? ఏది నిజమనేది మనకు మాత్రం తెలియదు. సాధారణంగా సీఎంలకు ఎవరైనా అపాయింట్ మెంట్ వెంటనే ఇస్తారు. ఏమైనా పనులన్నా ఫలానా రోజు రావాలని ముందుగా అపాయింట్ మెంట్ ఫిక్స్ చేస్తారు. సీఎంలకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం అనేది ఉండదు.

కానీ జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మోదీని కలుస్తారు కానీ అమిత్ షాను కలవరు. జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతోనే అమిత్ షాను కలవలేదనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడతాయి. దీనికి కారణం ఏంటనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరోసారి కూడా అలాంటి చర్చే జరుగుతోంది. అమిత్ షా పట్ల జగన్ తీరు హాట్ టాపిక్ గా మారింది. సీఎంలతో అమిత్ షా నిర్వహించిన కీలక సమావేశానికి జగన్ డుమ్మా కొట్టారు. తిరువనంతపురంలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం అమిత్ షా అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. దక్షిణాది రాష్ట్రాల సమస్యలు, రాష్ట్ర మధ్య నెలకొన్న విబేధాలను ఈ సమావేశంలో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తారు.

ఇలాంటి కీలక సమావేశానికి జగన్ డుమ్మా కొట్టారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సీఎంలదరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏపీ తరపున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. ఇక బీజేపీతో ఉన్న వైరం వల్ల కేసీఆర్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. కానీ జగన్ ఎందుకు హాజరుకాలేదనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో తిరుపతిలో సదరన్ సమావేశం జరగ్గా.. జగన్ హాజరయ్యారు. కానీ ఈ సారి జగన్ హాజరుకాకపోవడం వెనుక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

అమిత్ షా సమావేశానికే జగన్ డుమ్మా కొట్టడం, ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అమిత్ షాను కలిసేందుకు ఆసక్తి చూపకపోవడం వెనుక జగన్ కు అమిత్ షా అంటే ఇష్టం లేదనే విషయాలను స్పష్టం చేస్తున్నాయి. తాజాగా అమిత్ షా నిర్వహించిన కీలక సమావేశానికి జగన్ డుమ్మా కొట్టడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. ఉద్దేశపూర్వకంగానే అమిత్ షా సమావేశానికి జగన్ డుమ్మా కొట్టారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -