Salaar: సలార్ సినిమా మేకర్స్ కు ఆ సినిమాపై నమ్మకం లేదా.. సినిమాకు పబ్లిసిటీ చేయకపోవడానికి కారణాలివేనా?

Salaar: సలార్ సినిమా గురించి పెద్దగా బజ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ డైనోసార్ ఎప్పుడు విడుదలవుతుందో ఎన్ని సినిమాలు మీద దండయాత్ర చేస్తుందో అని ప్రేక్షకులు వేయి కనులతో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 28న విడుదల అవ్వాల్సిన సలార్ కొన్ని ఎడిటింగ్ పనుల వల్ల, గ్రాఫిక్ పనులు వల్ల డిసెంబర్ 22 కి వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఆకలితో ఎదురుచూస్తున్నారు.

సినిమాకి ఇంకా రెండు నెలలు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికి వచ్చి ఒక్క టీజర్ తప్ప ఇంకేమీ విడుదల చేయలేదు చిత్రం బృందం. మామూలుగా ఏ సినిమాకైనా పాటలు ముందు విడుదల చేస్తారు కానీ ఇందులో విడుదల చేయడానికి ఒకటి లేదా రెండు పాటలు మాత్రమే ఉన్నాయట.వీటిని ఇప్పుడే విడుదల చేస్తే సినిమాకి నెల ముందు హైప్ తగ్గుతుంది అని ఆలోచిస్తున్నారట చిత్ర బృందం.

కానీ అప్డేట్స్ ఇవ్వాలనుకుంటే ఎలాగైనా ఇవ్వచ్చు. సినిమా సెట్లలో ఉన్న కొన్ని స్టిల్స్ ని, లేకపోతే మిగిలిన క్యారెక్టర్ లకి సంబంధించిన స్టిల్స్ ని రెండు వారాలకి చొప్పున ఒకటైన రిలీజ్ చేస్తే బజ్ జరుగుతుంది. ఎందుకంటే సినిమా వాయిదా పడడంతో ఎడిటింగ్ లో లోపాలు ఉన్నాయని గ్రాఫిక్స్ బాలేదని అలాగే డిస్టబ్యూటర్ దగ్గర గొడవలు ఉన్నాయి అని పుకారులు రేగుతున్నాయి.

అందుకే చిన్న చిన్న సినిమాలు డిసెంబర్ 22 కి పది రోజులు అటు ఇటులో సినిమాలను విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర బృందం ఒక ట్రైలర్ ని వదిలితే కానీ మళ్ళీ ఆ హైప్ రాదు. ఒకసారి సినిమా విడుదల హిట్టు టాక్ పడితే ఇంకా దీని అరాచకం మామూలుగా ఉండదు. ఆకలితో ఉన్న ప్రభాస్ అభిమానులకు ఫుల్ మీల్స్ పడతాయి

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -