Arun Kumar: బీఆర్ఎస్ కు ఏపీలో ఆ సీనియర్ నేత సపోర్ట్.. బాధ్యతలు తీసుకుంటారా?

Arun Kumar: తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పై ఏపీలో జోరుగా చర్చ జరుగుతోంది. నిన్నటి నుంచి బీఆర్ఎస్ పైనే తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణిస్తారా.. లేదా అనే దానిపై మీడియా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, సీపీఐ,సీపీఎం పార్టీలు లాంటివి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా దేశ ప్రజల్లో ఆదరణ లభిస్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఉమ్మడి రాష్ట్రాన్ని రెండు విభజించిన కేసీఆర్ కు ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాంటి ఏపీలో కేసీఆర్ ఎలా ఓట్లు పొందుతారనేది ఎవరికీ అర్ధం కావడం లేదు.

ఇక చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన లాంటి ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఇక అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. అలాంటి చోట్ల బీఆర్ఎస్ పార్టీ ద్వారా పార్టీకి జాతీయ గుర్తింపు కేసీఆర్ ఎలా పొందుతారనేది అర్ధం కావడం లేదు. ఏపీలో కేసీఆర్ జాతీయ పార్టీ గురించి వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చని, అలాంటి అవకాశం అందరికీ ఉంటుందని అధికార వైసీపీ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ వల్ల ఏపీలో తమ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదన్నారు. వైసీపీ బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో కూడా తాము అదికారంలోకి వస్తామని అంటున్నారు. ఏపీలో కేసీఆర్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని తాము అనుకోవడం లేదని అంటున్నారు.

అయితే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని ఆహ్వానించాల్సిన అవసరముందని చెప్పారు. కేసీఆర్ హిందీ,ఇంగ్లీష్,తెలుగు బాషల్లో అనర్గరంగా మాట్లాడతారని, ఆయనంత వాగ్దాటితో ఎవరూ మాట్లాడలేరని స్పష్టం చేవారు. తాను బీఆర్ఎస్ కే ఓటు వేస్తానంటూ ఉండవల్లి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలో పోటీలోకి లేకపోతే తాను నోటాకు ఓటు వేస్తానంటూ ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాను. బీజేపీని వ్యతిరేకించే పార్టీలకే వచ్చే ఎన్నికల్లో తాను ఓటు వేస్తానని, బీఆర్ఎస్ ఏపీలో పోటీ చేస్తే తన ఓటు ఆ పార్టీకేనని వ్యాఖ్యానించారు.

అయితే కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ విజయవంతం అవుతుందో.. లేదో తాను ఇప్పడు చెప్పలేనని ఉండవల్లి స్పష్టం చేశారు. జాతీయ పార్టీ ఏర్పాటు ఆలోచన ఎందుకు చేశారో గతంలో తాను కేసీఆర్ ను కలిసినప్పుడు తెలిపారని ఉండవల్లి గుర్తు చేశారు. ఆ సమయంలో తాను అన్ని విషయాలు కేసీఆర్ తో పంచుకున్నట్లు ఉండవల్లి వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తనకు సంతోషం కలిగించిందన్నారు. కేసీఆర్ ఎప్పుడూ పిలిచినా తాను వెళ్లి కలుస్తానంటూ ఉండవల్లి చెప్పారు.

కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాయిస్ మాత్రం బలంగా ప్రజల్లోకి చేరుతుందని అిబిప్రాయపడ్డారు. ప్రస్తుతం మమతా బెనర్జీ, స్టాలిన్, అఖిలేష్ యాదవ్ లాంటి నేతలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని కేసీఆర్ తెలిపారు. కానీ వాళ్ల కేసీఆర్ తో సమానంగా ఉండరని తెలిపారు. కేసీఆర్ అంత బలంగా వాయిస్ బీజేపీకి వ్యతిరేకంగా వినిపించలేరని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకివెళ్లినా తెలంగాణ రాజకీయాల్లో ఉంటారని అన్నారు. తెలంగాణను వదిలి వెళతారని తాను అనుకోవడం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఉండవల్లి గతంలో కేసీఆర్ ను కలవడం, ఇప్పుడు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయడంతో ఏపీలో బీఆర్ఎస్ బాధ్యతలను ఉండవల్లిని కేసీఆర్ అప్పచెబుతారనే ప్రచారం నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -