Chiranjeevi-Nagarjuna: ఇప్పటికైనా చిరు నాగ్ మల్టీ స్టార్ సినిమా చేస్తారా?

Chiranjeevi-Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల సినిమాల మధ్య పోటీ ఉన్నప్పటికీ హీరోల మధ్య ఏ విధమైనటువంటి పోటీ కానీ మనస్పర్థలు కానీ ఉండవనే విషయం మనకు తెలిసిందే. కేవలం వీరి అభిమానులు మాత్రమే పెద్ద ఎత్తున పోటీ పడుతూ ఒకరిపై ఒకరు దూషించుకోవడం జరుగుతుంది.కానీ ఇండస్ట్రీలో ఉండే హీరోలు మాత్రం ఒకరు సినిమాకు మరొకరు సహాయం చేసుకోవడమే కాకుండా ఎంతో స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఉంటారు.

ఇకపోతే నిన్నటి తర హీరోలలో చిరంజీవి నాగార్జున మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే.వీరిద్దరూ ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా ఉండడం మాత్రమే కాకుండా ఎన్నో వ్యాపారాలలో భాగస్వాములుగా కూడా ఉన్నారు.ఇక ఈ ఇద్దరు హీరోలు కలిసి నేటి తరం హీరోలను ప్రోత్సహిస్తూ వారి సినిమా ప్రమోషన్లను కూడా నిర్వహిస్తూ ఉన్నారు.ఇక చిరంజీవి నాగార్జున మధ్య మంచి అనుబంధం ఉండటమే కాకుండా వీరి వారసుల మధ్య కూడా అంతే మంచి అనుబంధం ఉందని చెప్పాలి.

ఇకపోతే వీరి మధ్య ఉన్న స్నేహబంధం ఏంటో మరోసారి చిరంజీవి రుజువు చేశారు. ఆగస్ట్ 29వ తేదీ కింగ్ నాగార్జున పుట్టినరోజు కావడంతో మెగాస్టార్ చిరంజీవి గతంలో నాగార్జునతో కలిసి దిగిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఒక చైర్ లో చిరంజీవి కూర్చోగా వెనక నాగార్జున నిలబడి చిరంజీవి భుజంపై చేయి వేసుకొని నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక ఈ ఫోటోని చిరంజీవి షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే మై డియర్ ఫ్రెండ్ నాగార్జున.. ఆయురారోగ్యాలతో సంతోషంగా విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ విధంగా వీరిద్దరూ కలిసి దిగినటువంటి ఈ ఫోటోని షేర్ చేయడంతో వీరి మధ్య ఎలాంటి సాన్నిహిత్యం ఉందో అర్థమవుతుంది. ఇకపోతే ఎప్పటికైనా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చూడాలని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.అప్పట్లో వీరిద్దరూ మల్టీ స్టార్లర్ చిత్రంగా చేయాలని రాఘవేంద్రరావు ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ హీరోల అభిమానులకు సమన్యాయం చేయలేమన్న కారణంతో వెనకడుగు వేశారు.అయితే ఇప్పటికైనా వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మల్టీ స్టార్టర్ వస్తే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. మరి అభిమానుల కోరిక నెరవేరుతుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -