Amaravati: అమరావతి రైతుల పరిస్థితిని చూసి సీఎం జగన్ లో మార్పొస్తుందా?

Amaravati: అమరావతిలో పేద ప్రజలకు ఇల్లు పట్టాలు పంపిణీ చేసే తేదీ దగ్గర పడుతున్న తరుణంలో పెద్ద ఎత్తున నెలకొంది.అమరావతి రాజధాని కోసం ప్రజలు ఇచ్చిన భూమిలో జగన్ ప్రభుత్వం పేదలకు ఇల్లు పట్టాలు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో దీనిని అమరావతి రైతులు అడ్డుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అమరావతి జేఏసీ నేతలకు ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య గొడవలు అవుతున్నాయి.

ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో నిరాహారదీక్షలు చేస్తున్నారు.కొన్ని గ్రామాలలో ప్రభుత్వ అధికారులు ఇల్లు నిర్మాణ పనులు చేపట్టడానికి రావడంతో అక్కడ రైతులు పెద్ద ఎత్తున వాటిని అడ్డుకోవడం కాకుండా ఆందోళనలు చేపడుతున్నారు. అలాగే ఇల్లు స్థలాల వద్ద జెసిబి లతో పనులు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులను కూడా రైతులు అడ్డుకున్నారు.

 

సుప్రింకోర్టులో కేసు విషయం తేలేంత వరకు ప్రభుత్వం పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు, జేఏసీ నేతలు యంత్రాంగంపై మండిపోతున్నారు. పెట్రోలు, కిరోసిన్ నింపిన సీసాలను ఆందోళనకారులు అధికార యంత్రాగానికి చూపిస్తున్నారు. ఇల్లు పట్టా పంపిణీ పనులు ఆపకపోతే తాము వీటికి పనులు చెప్పాల్సి ఉంటుందంటూ రైతులు అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారు.

 

దొండపాడు గ్రామం ప్రాంతంలో లేఅవుట్లు వేయటానికి అధికారులు తీసుకొచ్చిన జేసీబీలను రైతులు అడ్డుకుని వెనక్కు పంపించారు. ఇలా ప్రభుత్వ అధికారుల పనులను అడ్డుకున్నారన్న ఉద్దేశంతో అధికారులు అరెస్టులు కూడా చేశారు.ఇలా అమరావతి ప్రాంతంలో రోజురోజుకు ఉచిత పెరుగుతూ ఉన్నప్పటికీ జగన్ తన మనసులో ఏ మాత్రం మార్చుకోలేకపోతున్నారో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా జగన్ తన అభిప్రాయాన్ని మార్చుకుంటారో లేదో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -