Bigg Boss 6-India vs Pakisthan: బిగ్ బాస్ కు గట్టి పోటీ అయిన క్రికెట్ మ్యాచ్!

Bigg Boss 6-India vs Pakisthan: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ బాస్ షో గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అన్నిషోల కంటే భారీ స్థాయిలో బిగ్ బాస్ షో మరో స్థాయిలో ప్రేక్షక ఆధారణ దక్కించుకుంది. ఇప్పటికే 5 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ప్రస్తుతం ఆరో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది.

అంతేకాకుండా ఈసారి 19 మంది కంటెస్టెంట్లలో ఇద్దరు కామన్ వ్యక్తులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బిగ్ బాస్ ప్రియులు బిగ్ బాస్ సీజన్ సిక్స్ కోసం గత కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నాగార్జున బిగ్ బాస్ షో గురించి రోజుకు ఒక అప్ డేట్ ఇస్తూ బిగ్ బాస్ ప్రియులకు మరింత ఆసక్తికరంగా ఉండేలా చేస్తున్నాడు. ఇక మరికొన్ని గంటల్లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో తీవ్రమైన అన్యాయాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది.

అదేమిటంటే.. గ్రాండ్ ఈవెంట్ కోసం బిగ్ బాస్ హౌస్ ను అనేక రకాలుగా తీర్చిదిద్దారు. ఇక హోస్ట్ నాగార్జున కూడా ఈసారి ఫన్ డోస్ మరింత పెంచేలా ప్లాన్ చేసినట్లు కూడా అర్థమవుతుంది. కానీ ఇంతలోనే బిగ్ బాస్ కు ఒక క్రికెట్ మ్యాచ్ అడ్డం వచ్చింది. అది కూడా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కావడంతో బిగ్ బాస్ షో నిర్వాహకులు మరింత విచారానికి గురయ్యారు. కనుక బిగ్ బాస్ షో ఈరోజు గ్రాండ్ ఓపెనింగ్ రేటింగ్ పై క్రికెట్ ప్రభావం ఎంతో కొంత పడుతుందని భావిస్తున్నారు.

మరి మ్యాచ్ ఒక రోజుతో పోయేది అంటే అది కాదు.. సీజన్ అంతా టిఆర్పి పై క్రికెట్ ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ తర్వాత టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లు స్టార్ట్ అవ్వబోతున్నాయి. దాంతో బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి క్రికెట్ అన్యాయం చేయబోతుందనే వార్తలు విన్నపడుతున్నాయి. ఇక ఈరోజు బిగ్ బాస్ లో కంటెస్టెంట్లు గా ఎవరు వస్తారు అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -