KCR-Jagan: కేసీఆర్ లాగే అసెంబ్లీలో జగన్ ఆ తీర్మానం చేస్తారా?

KCR-Jagan: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. తెలంగాణలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ఏపీలో.. ఏపీలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది తెలంగాణలో కూడా అమలు చేస్తారా అనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రాజకీయ అంశాలలో ఇలాంటి చర్చలు బాగా జరుగుతూ ఉంటాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళితే.. ఏపీలో కూడా జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. అలాగే రాజకీయాంగా ఎలాంటి నిర్ణయాలైనా ఒక రాష్ట్రంలో తీసుకుంటే.. మరో రాష్ట్రంలో కూడా తీసుకుంటారనే ఊహాగానాలు సాధారణంగానే వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి చర్చే ఒకటి తెరపైకి వచ్చింది.

తెలంగాణలో నిర్మిస్తున్న నూతన సచివాలయ భవానానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం ఓ గెజిట్ ను కూడా అధికారికంగా విడుదల చేసింది. అలాగే అంతకుముందు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఏకంగా అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ తీర్మానానకి సంబంధించి కాపీలను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అసెంబ్లీల్లో తీర్మానాలు చేస్తే పార్లమెంట్ లో కూడా ఆ కాపీలు చేరుతాయి. దాని వల్ల పార్లమెంట్ లో కూడా దీనిపై చర్చ జరుగుతోంది. కేసీఆర్ తో పాటు చాలా రాష్ట్రాల నుంచి కూడా ఈ డిమాండ్ వినిపిస్తోంది.

కానీ తెలంగాణ ప్రభుత్వంలా మిగతా రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేయలేదు. ఒకవేళ పార్లమెంట్ కొత్త భవనానికి అంబేద్కర్ పేరు పెడితే ఆ క్రెడిట్ కేసీఆర్ కే దక్కుతుంది. అసెంబ్లీలో తీర్మానం చేశారు కనుక కేసీఆర్ కే ఆ క్రెడిట్ వస్తుంది. ఒకవేళ అంబేద్కర్ పేరు పెట్టకపోతే దలితుల పట్ల కేంద్రం వివక్ష చూపుతుందని, మహానీయుడు పేరును పార్లమెంట్ కు పెట్టకపోవడం దుర్మార్గమని కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ విరుచుకుపడే అఅవకాశముంది. అందుకే సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు, అసెంబ్లీలో తీర్మానం చేయడంతో బీజేపీకి కేసీఆర్ సమస్యను తెచ్చిపెట్టినట్లు అయింది.

అయితే కేసీఆర్ లాగా కొత్త పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో జగన్ తీర్మానం చేస్తారా అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరగ్గా.. శనివారం, ఆదివారం కావడంతో అసెంబ్లీ వాయిదా పడిది. ఐదు రోజులు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించగా.. ఇంకా రెండు రోజులు మిగిలి ఉన్నాయి. ఇప్పటికే కోనసీమ జిల్లాకు ఏపీ ప్రభుత్వం అంబేద్కర్ పేరు పెట్టింది. దాంతో జగన్ కూడా కేసీఆర్ తరహాలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపవచ్చే అవకాశలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. తీర్మానం చేసి పంపితే కేంద్రం అంబేద్కర్ పేరు పెడుతుందా.. లేదా అనేది తర్వాతి అంశం.

తీర్మానం చేసి పంపడం వల్ల దళితులను వైసీపీ ఆకర్షించవచ్చు. తాము తీర్మానం చేసి పంపామని చెప్పుకొవచ్చు. ఇప్పటికే జగన్ కూడా కేసీఆర్ లా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్డిమాండ్ చేశారు. తీర్మానం చేసి కేంద్రానకి పంపాలని కోరారు. దీంతో జగన్ కూడా పార్లమెంట్ కు అంబేద్కర్ పపేరు పెట్టాల్సందిగా అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం లేకపోలేదనే చర్చ జోరుగా జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -