CM KCR: మునుగోడు ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ మాట్లాడతారా?

Munugodu Bypoll: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. ఇప్పటికే ఢిల్లీలో రెండుసార్లు అమిత్ షాతో భేటీ అయిన ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా ఒకసారి కలిశారు. బీజేపీలో చేరికతో పాటు మునుగోడు ఉపఎన్నికలపై చర్చించారు. ఈ నెల 21న అమిత్ షా తెలంగాణకు రానున్నారు. మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ బహిరంగ సభకు అమిత్ షా హాజరుకానుండగా.. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆ లోపు స్పీకర్ ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు.

మునుగోడు ఉపఎన్నిక దాదాపు ఖాయం కావడంతో పార్టీలన్నీ జోరు పెంచాయి. ఇప్పటికే మునుగోడు ఉపఎన్నికకు కాంగ్రెస్, బీజేపీ కమిటీలు ప్రకటించాయి. కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఉపఎన్నికకు సమరశంఖం పూరించింది. ఇక టీఆర్ఎస్ కూడా ఈ నెలలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతుండగా.. బీజేపీ ఎలాగైనా గెలిచి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. ఇక ఎన్నికలకు ఇంకా కొద్ది నెలలు మాత్రమే ఉండటంతో మునుగోడు ఉపఎన్నికలో గెలిచి సత్తా చాటాలని అధికార టీఆర్ఎస్ భావిస్తోంది.

అయితే శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్.. దాదాపు రెండు గంటల పాటు మాట్లాడారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపిన కేసీఆర్.. ఆ సంస్థపై దుమ్మెత్తిపోశారు. అలాగే మోదీ ప్రభుత్వంపై ఒంటి కాలిపై విరుచుకుపడ్డారు. మోదీ విధానాలను ఎండగడతామన్నారు. కానీ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన మునుగోడు ఉపఎన్నికపై మాత్రం కేసీఆర్ స్పందించకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రేపు మాట్లాడతామంటూ దాటవేశారు. దీంతో ఇవాళ మునుగోడు ఉపఎన్నికపై కేసీఆర్ స్పందిస్తారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.

మునుగోడు ఉపఎన్నికపై గులాబీ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఫోకస్ పెట్టారు. పలు సర్వేలు చేయిస్తున్నారు. సర్వేలో వచ్చే రిపోర్ట్ ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేసే పనిలో పడ్డారు. గెలుపు గుర్రానికే టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. నల్లగొండ జిల్లా అంటేనే ఎప్పటినుంచో కాంగ్రెస్ కు కంచుకోట. టీఆర్ఎస్ కు అక్కడ అంత బలం లేదు. ఇక బీజేపీకి కూడా అక్కడ బలం లేదు. దీంతో కాంగ్రెస్ కు కంచుకోట లాంటి మునుగోడులో ఓడిపోతే ఆ ప్రభావం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పడే అవకాశముంది. ఇప్పటికే సీనియర్ నేతలూ రేవంత్ కు సపోర్ట్ చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మునుగోడు ఉపఎన్నిక రేవంత్ కు అగ్నిపరీక్షగా మారింది.

దీంతో మునుగోడులో ఎలాగైనా కాంగ్రెస్ ను గెలిపించాలనే ప్రయత్నంలో రేవంత్ ఉన్నారు. ఇక బీజేపీ గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేసే అవకాశముంది. రాజగోపాల్ రెడ్డికి ఉన్న ఇమేజ్ తప్పితే అక్కడ బీజేపీకి అంతగా క్యాడర్ లేదు. ఇలాంటి తరుణంలో బీజేపీ గెలుపు కోసం సర్వశక్తులా ప్రయత్నాలు చేసే అవకశముంది. ఇక టీఆర్ఎస్ కు అక్కడ ఎంతోకొంత బలం ఉంది. దీంతో గెలుపు కోసం తీవ్రంగా శ్రమించే అవకాశముంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -