Lokesh: ఆ విషయాలలో నారా లోకేశ్ మాట నిజంగా నిలబెట్టుకుంటారా?

Lokesh: సాధనమున పనులు సమకూరు ధరలోన అని ఒక పద్యం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అది ఇప్పుడు టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ ని చూస్తే నిజమే అనిపిస్తుంది. నిజమేనండి ఒకప్పుడు ప్రతి దానికి తడబడిపోయి నోటికి వచ్చింది మాట్లాడి బాగా ట్రోలింగ్ కి గురయ్యేవాడు. కానీ ఇప్పుడు ఆచితూచి మాట్లాడుతున్నాడు. అడిగిన ప్రశ్నలకి తడుముకోకుండా సమాధానం చెప్తున్నాడు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా.. మాజీ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్రలో నెల్లూరులోని ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పాదయాత్రలో భాగంగా ఆయన వివిధ వర్గాల ప్రజలతో భేటీవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది మీరు కూడా జగన్ లాగా వ్యవహరిస్తే మా పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. జగన్ కూడా పాదయాత్ర చేసినప్పుడు అనేక హామీలు ఇచ్చారు అధికారంలోకి రాగానే వాటిని నెరవేరుస్తామని.. కూడా చెప్పారు కానీ సిపిఎస్ రద్దు మధ్య నిషేధం వంటి ముఖ్యమైన హామీలను మర్చిపోయారు.

 

మీరు కూడా మీరు ఇచ్చిన హామీలను మరిచిపోతే మా పరిస్థితి ఏమిటి అంటూ నిలదీశారు. వెయ్యి కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసినప్పటికీ ఎవరు నుంచి ఇలాంటి ప్రశ్నలు ఎదురుపడలేదు. కానీ నెల్లూరు వ్యాపారం నుంచి ఇలాంటి ప్రశ్న ఎదురయ్యేసరికి నారా లోకేష్ తడబడ్డాడు కానీ వెంటనే తేరుకొని నన్ను జగన్ తో పోల్చవద్దని నేను అంత మొండిగా వ్యవహరించనని కేవలం ప్రజలని మోసగించడానికి అప్పట్లో జగన్ హామీల వర్షం కురిపించారని చెప్పుకొచ్చాడు లోకేష్.

 

నేను గత అనుభవంతో మాత్రమే హామీలని ఇస్తున్నానని కాబట్టి వాటిని నెరవేర్చకపోవడం అనే సమస్య ఉండదని చెప్పుకొని వచ్చారు. అదే సమయంలో మరో వ్యక్తి సీఎం ఎప్పుడు అవుతారు అని ప్రశ్నించాడు. చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగిన నాయకుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఆయనని గెలిపించుకోవడం మన కర్తవ్యం కాబట్టి ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కాబోవు అని చెప్పుకొచ్చాడు లోకేష్. మొత్తానికి మాటలు నేర్చిన లోకేష్ ఇచ్చిన హామీలని నెరవేరుస్తాడా అనేది వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -