Prabhas: ప్రభాస్ షూటింగ్ లోని నటీనటుల కోసం అలా చేస్తారా?

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ అనంతరం తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నారు. ఇక సినిమాలలో ప్రభాస్ పాత్ర ఎలా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆయన మంచి మనసున్న ఓ మహారాజు.

మంచి తనానికి కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ కుటుంబమని చెప్పాలి.ముఖ్యంగా ఆకలితో ఉన్న వారి కడుపు నింపడంలో ప్రభాస్ కుటుంబానికి ఎవరు సాటిరారు. ఇంటికి వచ్చిన అతిథికి కడుపునిండా భోజనం పెట్టే ఆనవాయితీ ఎప్పటినుంచో ప్రభాస్ కుటుంబంలో ఉంది అయితే అదే ఆచారాన్ని ఈయన కూడా కొనసాగిస్తున్నారు. ఇక ప్రభాస్ షూటింగ్ లొకేషన్లో కనక ఉంటే అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఎన్నో రకాల భోజనాలు ఇంటి నుంచి వస్తాయి.

 

ఇప్పటికే ఎంతోమంది ప్రభాస్ మంచితనం గురించి ఆయన ఇచ్చే ఆతిథ్యం గురించి చెప్పిన సంఘటనలు ఉన్నాయి. అయితే తాజాగా రంగస్థలం మహేష్ సైతం ప్రభాస్ గొప్పతనం గురించి తెలియజేశారు. ప్రభాస్ షూటింగ్ లొకేషన్లో వందమంది ఉన్న 200 మంది ఉన్న ఇంకా 300 మంది ఉన్నా కూడా అందరికీ ఒకే రకమైన భోజనాలను తీసుకువస్తారు. అక్కడ చిన్న పెద్ద అనే తేడాలు అస్సలు ఉండవని మహేష్ తెలిపారు.

మహేష్ ను ప్రభాస్ ప్రశ్నిస్తూ మీకు ఫుడ్ ఐటమ్ ఏది ఇష్టము అని అడిగారట తనకు మటన్ అంటే ఇష్టమని చెప్పగా తర్వాతి రోజు తనకోసం ప్రత్యేకంగా మటన్ తీసుకువచ్చారని కడుపు నింపే విషయంలో ప్రభాస్ కి ఎవరు సాటి లేరని మహేష్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రభాస్ మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారని అయితే ఈ సినిమాలో ఈయన గళ్ళ చొక్కా వేసుకొని కామెడీ చేయబోతున్నారని ఈ సినిమాలో తన లుక్ అచ్చం అన్ స్టాపబుల్ కార్యక్రమంలో మాదిరిగానే ఉండబోతుందంటూ మహేష్ చెప్పినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -