Prabhas: ఆ దేశంలో కూడా ప్రభాస్ సత్తా చాటుతారా.. సక్సెస్ సాధిస్తారా?

Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా అన్ని భాషలలోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది విదేశాలలో కూడా ఈ సినిమాకు ఎంతో మంచి క్రేజ్ లభించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

 

ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత మూడు పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ప్రభాస్ అభిమానులు చాలా నిరాశ వ్యక్తం చేశారు కానీ ప్రభాస్ నటించినటువంటి సలార్ సినిమా మంచి సక్సెస్ కావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సలార్ సినిమాకి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.

సలార్ మూవీ లాటిన్ అమెరికాలో స్పానిష్ భాషలో మార్చి 7న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషయల్ గా ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు దీంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమా ఏకంగా స్పానిష్ భాషలో విడుదల కాబోతుంది అంటే ఇది తెలుగు చిత్ర పరిశ్రమకే ఎంతో గర్వకారణం అని అభిమానులు భావిస్తున్నారు.

 

బాహుబలితో వరల్డ్ వ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించిన ప్రభాస్ ఇప్పుడు తన సలార్ తో మరింతగా పేరు సంపాదించడం ఖాయం. ఇక ఈ సినిమా కేవలం మొదటి భాగం మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది రెండో భాగంలో అసలు సిసలైన కథ ఉంటుందని మొదటి భాగం కేవలం రెండో భాగానికి ట్రైలర్ మాత్రమే అంటూ మేకర్స్ రెండో భాగంపై కూడా భారీ స్థాయిలో అంచనాలను పెంచేశారు.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -