Prabhas-Sreeleela: ప్రభాస్, శ్రీలీల కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ.. బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమేనా?

Prabhas-Sreeleela:  పెళ్లి సందడి సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు నటి శ్రీ లీల. ఇలా మొదటి సినిమాతోనే తన నటన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఈమె అనంతరం రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో శ్రీ లీలకు ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వెల్లువెత్తాయి.

ప్రస్తుతం 10 సినిమా అవకాశాలను చేతిలో పెట్టుకున్నటువంటి శ్రీ లీల వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ నెల నుంచి ఈమె నటించిన సినిమాలన్నీ వరుసన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీలీల మరోవైపు కొత్త సినిమాలకు కూడా కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం అందుకున్నారని సమాచారం.

సీతారామం వంటి ఒక అందమైన ప్రేమ కథ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో రాబోతుందని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రీ లీల నటించబోతున్నారని తెలుస్తుంది.

ఈ సినిమా వచ్చేయడాది షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుంది ప్రస్తుతం హను రాఘవపూడి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఇలా ప్రభాస్ సినిమాలో శ్రీలీలా నటించబోతుంది అంటే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పక్కా సందడి చేస్తుందని అలాగే కమర్షియల్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకుంటుందని పలువురు భావిస్తున్నారు. మరి వీరి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలి అంటే ఈ సినిమా గురించి అధికారక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -