World Cup: టీమిండియా వన్డే ప్రపంచకప్ అయినా గెలుస్తుందా?

World Cup: గత 40 ఏళ్ల కాలంలో టీమిండియా ఖాతాలో ఇప్పటివరకు మూడు ప్రపంచకప్‌లు మాత్రమే ఉన్నాయి. 1983 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ ఈ జాబితాలో ఉన్నాయి. కానీ ఇంగ్లండ్ ఖాతాలో గత పుష్కర కాలంలో మూడు ప్రపంచకప్‌లు చేరాయి. 2010 టీ20 ప్రపంచకప్, 2019 వన్డే ప్రపంచకప్, 2022 టీ20 ప్రపంచకప్ ఉన్నాయి. దీంతో టీమిండియాపై క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది.

 

భారత్‌లో క్రికెట్ క్రేజ్ ఎంతగా ఉంటుందో అందరికీ తెలిసిందే. నిజానికి క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ కంటే ఇండియాలోనే క్రికెట్ అభిమానులు ఎక్కువ. దీంతో వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ అయినా భారత్ గెలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వన్డే ప్రపంచకప్ నాటికి మంచి టీమ్ ఏర్పాటు చేసుకుని భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

అయితే వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫేవరెట్ కాదని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకేన్ వాన్ సంచలన ప్రకటన చేశాడు. భారత్ దగ్గర మంచి స్పిన్ ఆప్షన్స్ ఉన్నా.. ఆ జట్టును ఫేవరేట్‌గా భావించడం చెత్త వాదన అవుతుందని వాన్ అభిప్రాయపడ్డాడు. భారత్‌లో ప్రపంచకప్ జరుగుతుంది కాబట్టి ఆ జట్టును ఫేవరేట్‌గా భావించడం సరికాదని వాన్ పేర్కొన్నాడు.

వన్డే ప్రపంచకప్‌లో కూడా ఇంగ్లండ్ ఫేవరేట్
వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఇంగ్లండే ఫేవరెట్ అని మైకేల్ వాన్ తెలిపాడు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇంగ్లండ్ అత్యుత్తమ జట్టు అని.. తాము పెద్ద జట్టనే గర్వం దిగమింగుకుని భారత్ కూడా ఇంగ్లండ్‌ను అనుసరించాలని వాన్ సూచించాడు. తాను భారత క్రికెట్‌లో ఉంటే గర్వాన్ని వదిలేసి కచ్చితంగా ఇంగ్లండ్‌ను ఫాలో అయ్యేవాడినని చెప్పాడు. మరికొన్నేళ్లపాటు ప్రపంచ క్రికెట్‌ను ఇంగ్లండ్ ఏలుతుందని వాన్ ధీమా వ్యక్తం చేశాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -