Teja Sajja: ప్రభాస్, మహేష్ సినిమాలను మించి తేజ సజ్జా మూవీ సక్సెస్ సాధిస్తుందా?

Teja Sajja: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం హనుమాన్. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడుతూనే వస్తోంది.


అయితే సినిమా ఎక్కువగా సిజి వర్క్ మీద ఆధారపడడం వల్ల అస్సలు తొందరపడడం లేదు. ఆగస్టు అనుకున్నారు. కాదు డిసెంబర్ అనుకున్నారు.

 

కానీ ఇప్పుడు జనవరి అదే సంక్రాంతికి అంటూ ప్రకటించబోతున్నారు. ఈ సినిమాలో తేజసజ్జా హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టులో విడుదల అవుతుంది అనుకుంటున్నా నేపథ్యంలో డిసెంబర్ కాదు జనవరి అనడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా దాదాపు రెడీ అయిపోతున్న సినిమాను అన్ని నెలలు హోల్డ్ చేసి పెట్టడం అన్నది ఒక పాయింట్. హేమా హేమీ సినిమాలు పోటీ పడతాయి అని అనుకుంటున్న 2024 సంక్రాంతి రేస్ లోకి హనుమాన్ దిగడం అన్నది మరో పాయింట్ అని చెప్పవచ్చు. ఇప్పటికే సంక్రాంతి 2024 బరిలోకి ప్రభాస్ ప్రాజెక్ట్ కే, మహేష్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగిల్ రావడానికి సిద్దంగా వున్నాయి.

 

ప్రాజెక్ట్ కె రాదన్న ధీమాతో హనుమాన్ వస్తుంది అనుకున్నారు. కానీ ప్రాజెక్ట్ కే పక్కాగా వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమా కూడా కిందా మీదా పడయినా సంక్రాంతి బరిలోకి తీసుకురావాల్సిందే. అది దాటితే ఆ సినిమాకు చాలా కష్టం అవుతుంది. ఇటు కాస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. రెండవది ఆ సీజన్ కాకుంటే మార్కెట్ ఎఫెక్ట్ అవుతుంది. అయితే ప్రభాస్ మహేష్ బాబు సినిమాలకు పోటీగా హనుమాన్ సినిమా వస్తుందాలేదా అన్నది తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే మరి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -