Bholaa Shankar: భోళా శంకర్ మూవీ సక్సెస్ కు ఆ ట్విస్ట్ కీలకం అవుతుందా?

Bholaa Shankar: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఆచార్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన చిరంజీవి ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలవడంతో ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

అదే ఊపుతూ చిరంజీవి ప్రస్తుతం తదుపరి సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం భోళా శంకర్. ఈ సినిమాకు మెహ‌ర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిరంజీవి ఈ సినిమాకు సంబంధించిన 50 శాతం షూటింగ్ ని పూర్తి చేశారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ పై ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. చిరంజీవి క్యారెక్టర్ సంబందించిన ఓ ట్విస్ట్ ఈ సీక్వెన్స్ లో రివీల్ అవుతుందని, సినిమా మొత్తంలోనే ఈ ఇంటర్వెల్ హైలైట్ అవుతుంది అని తెలుస్తోంది. చిరు తన కెరీర్ లోనే భోళా శంకర్ సినిమాలోని పాత్ర కోసం ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు. భోళా శంకర్ సినిమాకు ఆ ట్విస్ట్ హైలెట్ కానుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమా తర్వాత దర్శకుడు మొహర్ రమేష్ తోనే చిరంజీవి మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -