Assembly Seats: అసెంబ్లీ సీట్ల పెంపుపై తెలుగు రాష్ట్రాల అశలు.. ఉంటుందా? లేదా?

Assembly Seats: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై రాజకీయ పార్టీలన్నీ ఆశలు పెట్టుకున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు జరిగితే సీట్లు పెరుగుతాయని, దీని వల్ల చాలామంది నేతలకు టికెట్లు దక్కుతాయనే ఆశలో పార్టీలు ఉన్నాయి. ఎక్కువ మందికి టికెట్లు ఇవ్వవొచ్చనే ఆలోచనలో పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీల్లో టికెట్ల కోసం చాలా పోటీ ఉంది. ఒక అసెంబ్లీ నుంచి టికెట్ కోసం ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. దీంతో ఎవరికి టికెట్ ఇవ్వాలనేది పార్టీల అధినేతలకు అర్ధం కావడం లేదు. ఒకరికి టికెట్ కేటాయిస్తే మిగతావారు అసంతృప్తికి గురయ్యే అవకాశముంది. అసంతృప్త నేతలు ఇతర పార్టీల్లోకి వెళితే తమ పార్టీకి నష్టం జరుగుతుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.

అందుకే అసెంబ్లీ సీట్లను పెంచితే టికెట్ల కోసం పోటీ పడుతున్న నేతలందరికీ ఎక్కడో ఒకచోట నుంచి టికెట్ ఇవ్వవచ్చని, దీని వల్ల తమకు కూడా టికెట్ల కేటాయింపు విషయంలో తలనొప్పి తగ్గుతుందని పార్టీల అధినేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ ససీట్లు పెంపుపై పార్టీలన్నీ ఎప్పటినుంచో కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. కానీ విభజన హామీలన్నింటినీ పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎప్పటినుంచో సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ జరుగుతూనే ఉంది. ఇక ఇతర వ్యక్తులు కూడా సుప్రీంకోర్టులో ఈ అంశంపై పిటిషన్లు దాఖలు చేశారు.

అయితే పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలంటూ ప్రముఖ పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. వాదోపవాదనలు సుప్రీంకోర్టు వింటోంది. అసెంబ్లీ సీట్ల పెంపుపై తాజాగా కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అసెంబ్లీ సీట్లును పెంచుతారా లేదా అనేది చెప్పాలంటూ ప్రశ్నించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని, అసెంబ్లీ సీట్ల పెంపుపై స్పస్టత ఇవ్వాలని కోరింది. జమ్మకశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినట్లే.. తెలుగు రాష్ట్రాల్లో కూడా విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్లను పెంచాలని పిటిషనర్ కోరాడు.

దీనిపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మానసం విచారణ చేపడుతోంది. అసెంబ్లీ సీట్ల పెంపుపై వివరాలు సమర్పించాలని గురువారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని తెలపడానికి ఎందుకు జాప్యం చేస్తుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పిటిషన్ లోని అంశాలపై స్పందించడానికి మరికొంత సమయం పడుతుందని కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిలర్ జనరల్ తెలిపారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రం వేసిన పిటిషన్ తో కలిసి రెండు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ సీట్లకు సంబంధించిన పిటిషన్లను విచారించానలి పురుషోత్తంరెడ్డి తరపు న్యాయవాది కోరారు.

దీంతో ఆ రెండు రాష్ట్రాలకు పోలిక పెట్టి పిటిషన్లను విచారించడం ఎలా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విభజన చట్టం ప్రకారమే విచారణ చేపట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. దీంతో కేంద్రం దాఖలు చేసే అఫిడవిట్ పరిశీలించి నఅంతరం ఎనిమిది వారాల తర్వాత సుప్రీంకోర్టు తదుపరి విచారణ చేపట్టే అవకాశముంది. నవంబర్ 16,17వ తేదీల్లో విచారణ చేపట్టే అవకాశముంది.

అసెంబ్లీ సీట్ల పెంపుపై తెలుగు రాష్ట్రాల పార్టీలన్నీ ఆశలు పెట్టుకున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసే అఫిడవిట్ పై అన్ని పార్టీలు ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందనపై పార్టీలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అసెంబ్లీ సీట్ల పెంపుకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇస్తుందనే ఆశలు పార్టీలు ఉన్నాయి. ఒకవేళ సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇస్తే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: బ్యాండ్ ఎయిడ్ ఎప్పుడు తీస్తారు జగన్.. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇంతేనా?

CM Jagan: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి అంటే సింపతి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున డ్రామాలు చేస్తున్న సంగతి తెలుసు గత ఎన్నికలలో భాగంగా కోడి కత్తి కేసు అంటు...
- Advertisement -
- Advertisement -