Tollywood: 2022లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాలకే సొంతమా?

Tollywood: ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఎన్నో చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఆడియెన్స్ ను అలరించేందుకు విభిన్నమైన కథా,కథనాలు, భారీ బడ్జెట్, సాంకేతికతతో రూపొందిన సినిమాలతో వచ్చారు తెలుగు సినీ దర్శకులు. అయితే వాటిలో కొన్ని మాత్రమే భారీ వసూళ్లు సాధించాయి. అలాంటి టాప్–10 హైయెస్ట్ గ్రాసర్స్ గురించి తెలుసుకుందాం పదండి..

 

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ.1,200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన చిత్రాల జాబితాలో ఫస్ట్ ప్లేసును కైవసం చేసుకుంది. ఈ మూవీ బడ్జెట్ దాదాపుగా రూ.550 కోట్లు అని తెలుస్తోంది. ‘గీతగోవిందం’ డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మూవీ ‘సర్కారు వారి పాట’. సుమారు రూ.60 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లతో సక్సెస్ ఫుల్ వెంచర్ గా నిలిచింది.

 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హ్యాండ్సమ్ హంక్ దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేసిన చిత్రం ‘భీమ్లా నాయక్’. యువ దర్శకుడు సాగర్. కె దర్శకత్వం వహించిన ఈ సినిమా.. సుమారు రూ.70 కోట్లతో నిర్మితమై దాదాపుగా రూ.161 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ లు హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 3’. ఇదే కాంబోలో గతంలో వచ్చిన ‘ఎఫ్ 2’కు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా రూ.70 కోట్లు. అయితే ఏకంగా రూ.134 కోట్లు రాబట్టి ఔరా అనిపించింది.

 

ఆ హీరోలకు పెద్ద రిలీఫ్
యువ నటుడు నిఖిల్ కు ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. చందు మొండేటి దర్శకత్వంలో ఆయన నటించిన ‘కార్తికేయ 2’ ఈ ఏడాది రిలీజైంది. రూ.30 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా.. ఏకంగా రూ.120 కోట్లు రాబట్టి ఘన విజయం సాధించింది. ‘సీతారామం’ సినిమా రూ.30 కోట్లతో రూపొంది ఏకంగా రూ.90 కోట్లు రాబట్టింది. కల్యాణ్ రామ్ ‘బింబిసార’ రూ.40 కోట్ల బడ్జెతో తెరకెక్కి.. రూ.65 కోట్లు కలెక్ట్ చేసింది. ఏడాది చివర్లో ‘ధమాకా’ సక్సెస్ చిత్ర పరిశ్రమలో మరింత జోష్ ను నింపింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -