Jagan: ఆ పార్టీలు సైతం జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాయా.. ఏమైందంటే?

Jagan: వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికల్లో తన చేతిలో ఉన్న అన్ని అస్త్రాలను కోల్పోయారు. కానీ, సహజంగానే మొండి తనం జగన్ తత్వం. అందుకే, కొత్త అస్త్రాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంతవరకూ పక్కన ఈ అస్త్రాలు పని చేస్తాయో లేదో అనే విషయం పక్కన పెడితే.. వెంట వెంటనే వ్యూహాలకు పదుతున్న పెడుతున్నారు జగన్.

 

వాలంటీర్ల సాయంతో ఈ ఎన్నికలను ఏదో ఒకలా నెట్టుకొని వద్దామని అనుకున్నారు. కానీ, వాలంటీర్లను ఎలక్షన్ ట్యూటీలో వాడకూడదని ఈసీ ప్రకటించింది. అఫీషియల్ గా వారి సేవలను వినియోగించొద్దని చెప్పింది కనుక.. అన్ అఫీషియల్‌గా ప్రచారంలో దించాలి అనుకుంది. కానీ, టీడీపీ, జనసేన వాలంటీర్లపై ఓ నిఘా పెట్టి ఉంచారు. ఎవరైనా వాలంటీర్లు ఓటర్లను కలిస్తే ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టేందుకు కూటమి పార్టీ కార్యకర్తలు సిద్దమయ్యారు. ఈ తలనొప్పుు అన్నీ ఎందుకు అనుకున్న జగన్ ఓ మాస్టర్ ప్లాన్ వేశారని టాక్.

పెద్దఎత్తున గిఫ్టులు పంపిణీ చేసి ప్రభుత్వమే వాలంటీర్లను విధుల నుంచి తొలగించాలని చూస్తోందట. మళ్లీ అధికారం చేపట్టిన తర్వాత వాలంటీర్లకు ఎవరి ఉద్యోగం వాళ్లకి ఇస్తామని మాట ఇస్తుందని టాక్. విధుల నుంచి తొలగించిన తర్వాత వాలంటీర్లను ఎన్నికల ప్రచారం కోసం వాడుకోనున్నారట. ఎలాగూ వారి దగ్గర ఓటర్లకు సంబంధించిని వివరాలు ఉంటాయి కనుక పనికాస్త ఈజీ అవుతుందని జగన్ అంచనా.

 

జగన్ నెక్ట్స్ టార్గెట్ క్రిస్టియన్లు. గత ఎన్నికల్లో వైసీపీకే మెజారిటీ క్రిస్టియన్లు ఓట్లు వేశారు. ఈ విషయంలో బ్రదర్ అనిల్ ప్రోత్సాహం ఉంది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. క్రిస్టియన్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి విరుగుడుగా జగన్ తన మేనత్త వైఎస్ విమలారెడ్డిని రంగంలోకి దించారట. ఇప్పటికే ఆమె ఫాస్టర్ల‌తో సేవకుల సమావేశాలు జరుపుతున్నారని తెలుస్తోంది. దేవుడినే నమ్మకున్న జగన్ ను గెలిపించాలని ఆమె ఫాస్టర్లకు సూచిస్తున్నారట. కొందరు పాపులు జగన్ ను సీఎం పీఠం నుంచి దించేందుకు కుట్రలు చేస్తున్నారని.. ఆ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారని టాక్.
బ్రదర్ అనిల్ వలన కలుగుతున్న నష్టాన్ని కొంతమేర అయినా మేనత్తతో పూడ్చుకోవాలని జగన్ చూస్తున్నరట.

 

కానీ, ఈ వ్యూహం ఎంతవరకూ వర్క్ అవుట్ అవుతుందో చెప్పలేం. ఎందుకంటే.. క్రిస్టియన్లలో బ్రదర్ అనిల్ ఇమేజ్ ఇంతా అంత కాదు. ఆ ఇమేజ్ కు విమలారెడ్డితో చెక్ పెట్టడం కష్టమని క్రిస్టియన్ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. మరోవైపు షర్మిల తన ప్రసంగాల పదును పెంచారు. ఏపీలో అడుగు పెట్టిన తొలినాళ్లలోనే క్రిస్టియన్లను ఆమె టార్గెట్ చేశారు. క్రిస్టియన్ల కేంద్రంగా జగన్‌పై గట్టి విమర్శలు కూడా చేశారు. మణిపూర్ లో క్రిస్టియన్లపై దాడులు జరిగితే.. జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఓ క్రిస్టియన్ సీఎం చేయాల్సిన పనేనా ఇది అని నిలదీశారు. కాబట్టి క్రిస్టియన్ల దాదాపు దూరమైనట్టేనని చర్చ నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -