Sharmila: షర్మిలను ట్రోల్ చేయడం వల్ల వైసీపీ ఆ రేంజ్ లో నష్టపోనుందా?

Sharmila: ఏపీ రాజకీయాల్లో ఎక్కడ చూసినా షర్మిలపైనే చర్చ జరుగుతోంది. ఆమె ఏపీ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత జగన్ కి డ్యామేజ్ తప్పదని అందరికి అర్థమైంది. డ్యామెజ్ స్థాయి ఎంత ఉంటుందని లెక్కలు వేసుకోవాలే తప్పా.. నష్టం జరుగుతుంది అనడంలో అసలు అనుమానమే లేదు. షర్మిల కూడా నేరుగా వైసీపీని, జగన్‌నే టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. అయితే, ఇలాంటప్పుడు ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సింది పోయి షర్మిలకు మరిన్ని ఆయుధాలు ఇస్తున్నారు వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా. షర్మిలపై రాజకీయ విమర్శలు చేయడమే కాకుండ.. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్తున్నారు. అది ముమ్మాటికి తప్పే. వ్యక్తి గత అంశాలను ప్రస్తావించడం ఏపీ రాజకీయాల్లో అలవాటుగా మారినా.. అక్కడ ఉన్నది షర్మిల. అంటే స్వయాన సీఎం జగన్ చెల్లెలు. అది ఓ రకంగా జగన్ స్థాయిని తగ్గించే చర్యలు అవుతాయి.

 

షర్మిల వ్యక్తిగతంపై ట్రోల్ చేస్తే.. జగన్ వ్యక్తిగతం గురించి షర్మిలకు తెలియకుండా ఉంటుందా? ఆమెకూడా అదే పని చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పటి వరకు షర్మిల తన విమర్శల్లో వ్యక్తిగత అంశాలను ప్రస్తావించలేదు. ఇదే విషయం ఆమెపై సింపతీని పెంచుతుంది. ఇది వైసీపీకి పెద్దగా డ్యామేజ్ చేస్తుంది. కానీ, షర్మిల చాలా మొండి తనం ఉన్న రాజకీయ నాయుకురాలు. ఆమె రాజకీయాల్లో సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? పక్కనపెడితే… చాలా తక్కువ టైంలో తన మార్క్ రాజకీయాన్ని చూపించారు. 2014కు ముందు జగన్ జైలుకు వెళ్తే.. వైసీపీ క్యాడర్ లో తన పాదయాత్రతో ఆత్మవిశ్వాసం నింపారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి తనవంతు సాయంగా బస్సుయాత్ర చేశారు. ఇక ఆ తర్వాత తెలంగాణలో సొంతకుంపటి పెట్టుకొని.. అక్కడ కూడా తనమార్క్ చూపించారు. పెద్దగా ఆమె వెనక ఎవరూ లేకపోయినా.. 3వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. తెలంగాణలో మరే నాయకుడు ఇంతవరకూ అంత సుదీర్ఘమైన పాదయాత్ర చేయలేదు. ఒకానొకదశలో కాంగ్రెస్, బీజేపీ కంటే బీఆర్ఎస్ పై ఘాటైన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతల ఎదురుదాడిని తిప్పికొట్టారు.

వెనకాముందు ఎవరూ లేకుండానే ఇంత చేస్తే.. ఇప్పుడు ఆమెకు సపోర్టుగా ఓ జాతీయపార్టీ ఉంది. పెద్ద వ్యవస్థ ఉంది. ఇలాంటప్పుడు ఆమె తగ్గుతారు అనుకుంటే చాలా పొరపాటు. ఈ విషయాన్ని తెలుసుకోకుంటే వైసీపీకి చాలా నష్టం. ఇక్కడ కాంగ్రెస్ కు పోయేదేమీ లేదు. వెంట్రుకతో కొండను లాగుతున్నట్టు ఉంది. వస్తే కొండ.. పోతే వెంట్రుక అన్నట్టు ఉంది. కానీ, వైసీపీ పరిస్థితి అలా లేదు. అధికారంలో ఉంది. వ్యూహాత్మకంగా నడిస్తే మరిన్ని ఏళ్లు పార్టీకి మంచి భవిష్యత్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీకి ఉన్నది సాలిడ్ ఓట్ బ్యాంక్. సుమారు 40శాతానికిపైగా ఓట్ బ్యాంక్ వైసీపీతోనే ఉంటుంది. ఇక, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసినా.. ఆ 40శాతం ఓట్ బ్యాంక్ ను కొల్లగొట్టలేవు. కానీ, కాంగ్రెస్ బలపడితే వైసీపీ ఓట్ బ్యాంక్ హస్తం పార్టీతో ర్యాలీ అయ్యే చాన్స్ ఉంది. కాబట్టి, వీలైంత వరకు విమర్శలతో కాంగ్రెస్ కు, షర్మిలకు మైలేజ్ పెంచే చర్యలు తీసుకోకూడదు. షర్మిలను ఎంత లైట్ తీసుకుంటే.. అంత నష్టాన్ని తగ్గించుకోవచ్చు.

 

ఇక్కడే పీవీ నరసింహరావు రాజకీయ చరురతను గుర్తు చేసుకోవాలి. 1990 తొలినాళ్లలో అయోధ్య రామ జన్మభూమి అంశంలో అద్వానీ రదయాత్ర చేపట్టారు. అప్పుడ ఆ యాత్రను యూపీలో సీఎంగా ఉన్న ములాయం సింగ్ యాదవ్, బీహార్‌ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అడ్డుకున్నారు. అంతవరకు పెద్దగా వార్తల్లో లేని యాత్ర వీరిద్దరూ అడ్డుకున్న తర్వాత ప్రజల్లోకి వెళ్లింది. రధయాత్రకు విపరీతమైన మైలేజ్ పెరిగింది. అప్పటి నుంచే బీజేపీ పెరుగుదల మొదలై ఈ స్థాయికి వచ్చింది. చాలా మంది ముందు తరం నేతల బీజేపీ విషయంలో చేసిన అతిపెద్ద పొరపాటుగా ములాయం, లాలూ యాదవ్ ల గురించి చెబుతారు. కానీ, దీనికి భిన్నంగా పీవీ నరసింహారావు తన చాణుక్య నీతిని ప్రదర్శించారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ నేత మురళీ మనోహర్ జోషి యాత్రగా వెళ్ళి జాతీయపతాకాన్ని ఎగురవేస్తానని చెప్పారు. నిరభ్యంతరంగా ఆ పని చేసుకోవచ్చుని.. ప్రభుత్వం తరుఫున అన్ని విధాల సాయం అందిస్తామని పీవీ ప్రకటించారు. ఆ రోజుల్లో శ్రీనగర్ లో జాతీయ జెండా ఎగురవేయడం చాలా పెద్ద అంశం కానీ.. దాన్ని వ్యతిరేకించకపోవడంతో.. బీజేపీకి మైలేజ్ రాకుండా పీవీ తన చతురతను ప్రదర్శించారు.

 

వైసీపీ కూడా లాలూ, ములాయంలో ఉంటారో.. పీవీలా వ్యవహిరిస్తారో ఆలోచించుకోవాలి. ప్రతీసారి ప్రతిపక్షాల నిర్ణయాలను, ప్రకటనలు అడ్డుకోవడం వ్యూహాత్మకం కాదు. ఒక్కోసారి మౌనంగా ఉండటం. స్వాగతించడం కూడా డ్యామేజ్ కంట్రోల్ లో భాగం అవుతోంది. షర్మిల వైసీపీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీని కూడా విమర్శిస్తున్నారు. కానీ, వైసీపీపైనే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. వైసీపీయే చర్చలో ఉంటుంది. దానికి కారణం షర్మిల కామెంట్స్ కు వైసీపీ మాత్రమే కౌంటర్ చేస్తుంది. ఈ విషయాన్ని జగన్ ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంతమంచిది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -