Health: కీరదోస తింటే బరువు తగ్గుతారా? ఇందులో నిజమెంత?

Health: బరువు తగ్గేందుకు చాలామంది రకరకాల పద్దతులు పాటిస్తారు. కొంతమంది జిమ్ కు వెళ్లి వర్కౌట్లు చేస్తూ ఉంటారు. మరికొంతమంది పొద్దునే వాకింగ్, రన్నింగ్, వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ఇక చాలామంది డైట్ లాంటి పాటిస్తూ ఉంటారు. బరువు తగ్గడానికి తిండి తినడం మానేస్తారు. లైట్ గా ఫుడ్ తీసుకుంటూ డేట్ పాటిస్తూ ఉంటారు. డైట్ లలో కూడా చాలా రకాలు ఉన్నాయి. వాటిలో కీరదోస డైట్ కూడా ఒకటి. కీరదోస తింటే బరువు తగ్గుతామని చాలా మంది రోజూ అవే తింటూ ఉంటారు. కిరదోస్ తినడం ద్వారా 7 రోజుల్లో ఏకంగా 7 కిలోల బరువు తగ్గవచ్చని చెబుతూ ఉంటారు.
అయితే కీరదోస తింటే నిజంగా బరువు తగ్గుతారా.. లేదా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.ఇంతకి కీరదోస డైట్ ఎలా చేయాలి అనే వివరాలను ఇప్పుడు తెలసుకుందాం.

కీరదోసలో తక్కువ కేలరీలు ఉండటంతో పాట ప్రొటీన్లు కూడా తక్కువ ఉంటాయి. ఆహారాన్ని తీసుకోవడం తగ్గించి రోజూ కీరదోస ముక్కలను తింటే బరువు తగ్గవచ్చని చెబుతారు. ఆకలి అనిపించినప్పుడల్లా కీరదోస ముక్కల తినడం ఈ డైట్ లో భాగం. ఇక కోడగుడ్లు, చికెన్, చేపలు, తృణ‌ధాన్యాలను కూడా ఈ డైట్ లో భాగంగా తీసుకుంటారు. కీరదోస డైట్ కొద్దికాలానికి మాత్రం పనిచేస్తుందని, దీర్ఘకాలంలో లాభం జరగదని అంటున్నారు.

కీరదోసలో ఉండే పోషకాలు శరీరానికి సరిపోవని, దీదని వల్ల పోషకాహర లోపంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. కీరదోసలో ఉండే పోషకాలు శరీరానికి సరిపోవు. దీంతో జీవక్రియ దెబ్బతినడంతో పాటు చిరాకు, అలసట,డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. ఇక గుడ్లు, చేపలు, పండ్లు, చికెన్ వంటి వాటిని డైట్ లో తీసుకోవడం వల్ల లాభం ఉంటుందని, కీరదోసలు మాత్రమే తినడం వల్ల తాత్కాలికంగా బరువు తగ్గినా.. తర్వాత మళ్లీ బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు. ప్రతిరోజు మనం తినే ఆహారంలో 800 కేలరీలు ఉండాలని, 300 గ్రాముల కీరదోసలో 45 కేలరీలు ఉంటాయంటున్నారు. ఒకరోజు 3 కిలోల దోసకాయలు తిన్నా 450 కేలరీలు మాత్రమే వస్తాయంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -