Women T20: భారత మహిళల జట్టులో ఏపీ అమ్మాయి.. ఎవరో తెలుసా?

Women T20: ఈనెల 9 నుంచి సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టీమిండియా మహిళలు ఐదు టీ20ల సిరీస్ ఆడనున్నారు. ఈ సిరీస్‌కు సంబంధించి బీసీసీఐ శుక్రవారం నాడు 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను ప్రకటించింది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఈ జట్టులో ఆంధ్రా అమ్మాయి ఎంపికైంది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అంజలి శర్వాణి‌కి తొలిసారి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆదోనీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతం నుంచి జాతీయ జట్టుకు తెలుగమ్మాయి ఎంపిక కావడం గర్వకారణమని అభిప్రాయపడుతున్నారు.

అంజలి తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆమె తల్లి గృహిణిగా ఉన్నారు. ఆదోనీలోని స్థానిక మిల్టన్‌ ఉన్నత పాఠశాలలో అంజలి పదోతరగతి వరకు చదివింది. ఆ తర్వాత క్రికెట్‌పై ఆమెకున్న ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు.. ఆ రంగంలో ప్రోత్సహించారు. దీంతో అంజలి క్రికెట్‌ వైపు అడుగులు వేసి అంచెలంచెలుగా ఎదిగి భారత జట్టుకు ఎంపికైంది. శర్వాణి టీమిండియాకు ఎంపిక కావడంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.

సెలక్టర్లు ప్రకటించిన 15 మంది జట్టులో హర్మన్ ప్రీత్‌కౌర్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్, మేఘన సింగ్, అంజలి శర్వాణి, దేవికా వైద్య, ఎస్.మేఘన, రిచా ఘోష్, హర్లీన్ డియోల్ ఉన్నారు. డిసెంబర్‌ 9 నుంచి 20 వరకు జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా తరఫున ఏదో ఒక మ్యాచ్‌లో అంజలి శర్వాణి అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

ముంబైలోనే అన్ని మ్యాచ్‌లు
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఐదు టీ20 మ్యాచ్‌లన్నీ ముంబై వేదికగానే జరగనున్నాయి. డిసెంబర్ 9న తొలి టీ20 డీవై పాటిల్ స్టేడియంలో, 11న రెండో టీ20 డీవై పాటిల్ స్టేడియంలో, 14న మూడో టీ20 బ్రబౌర్న్ స్టేడియంలో, 17న నాలుగో టీ20 బ్రబౌర్న్ స్టేడియంలో, 20న ఐదో టీ20 బ్రబౌర్న్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ డే/నైట్‌గా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -