Lord Hanuman: హనుమంతుడిని తమలపాకులతో పూజిస్తే అన్ని కష్టాలు తొలగుతాయా?

Lord Hanuman: హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవుళ్లలో ఆంజనేయస్వామి కూడా ఒకరు చాలామంది ఆంజనేయస్వామిని పూజిస్తూ ఉంటారు. ఇలా ఆంజనేయుడిని పూజించడం వల్ల ఎలాంటి గ్రహ దోషాలు శని దోషాలు కూడా ఉండవని భావిస్తారు. అంతేకాకుండా ఆంజనేయుడు ధైర్యానికి ప్రతీక అలాంటి ధైర్యం మనలో కూడా ఉంటుందని భావిస్తారు. అందుకే ప్రతి మంగళవారం లేదా శనివారం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి చాలా మంది ప్రత్యేకంగా పూజలు చేస్తూ పూజిస్తుంటారు.

ఇక ఆంజనేయస్వామికి తమలపాకుల అంటే చాలా ఇష్టం ఇలా తమలపాకుల హారాన్ని కనుక స్వామివారికి సమర్పించి పూజ చేయడం వల్ల ఎన్నో కష్టాల నుంచి బయటపడవచ్చు. ఒకరోజు సీతమ్మ తల్లి తమలపాకులను చిలుకలుగా చుట్టి రామయ్యకు తినిపించగా రామయ్య నోరు మొత్తం ఎర్రగా పండింది అది చూసినటువంటి హనుమాన్ ఎందుకు అలా పండింది రామ అంటూ ప్రశ్నించారు తమలపాకు తింటే నోరు ఎర్రగా పండడమే కాకుండా మనశ్శాంతి కూడా ఉంటుందని చెప్పారట దాంతో హనుమంతుడు వెళ్లి తమలపాకులను మొత్తం శరీరానికి కట్టుకొని ఆనందంతో చిందులు వేశారట.

 

అందుకే అప్పటినుంచి హనుమంతుడిని ఎవరైతే తమలపాకుల హారంతో పూజిస్తారో అలాంటి వారిలో చాలా మనశ్శాంతి కలుగుతుందని ఏ విధమైనటువంటి కష్టాలు ఉండవని పండితులు చెబుతున్నారు.ఇలా హనుమంతుడికి తమలపాకుల హారంతో పూజించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి అలాగే సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఏర్పడతాయి. ఎవరైతే పిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారో అలాంటివారు హనుమంతుడికి తమలపాకుల హారం వేసి సింధూరం నుదుటిన పెడితే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.

 

ఇక వ్యాపారంలో ఎవరైతే నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారో అలాంటివారు ఆంజనేయుడికి తమలపాకుల హారం ఇచ్చి దక్షిణగా పండ్లను ఇవ్వటం వల్ల వ్యాపారాలలో జరుగుతున్నటువంటి నష్టాల నుంచి బయటపడతారు సుందరకాండ పారాయణం చేసే స్వామివారికి తమలపాకు హారం వేయడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఈ విధంగా ఆంజనేయుడికి తమలపాకుల హారం ఇవ్వటం వల్ల ఎన్నో ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -