KCR: వామ్మో.. ఈటలపై అభిమానంతో కేసీఆర్ అలా చేస్తున్నారా?

KCR: మరి కొద్ది నెలలలో తెలంగాణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో మరోసారి అధికారంలోకి రావడానికి బిఆర్ఎస్ ప్రభుత్వం సరికొత్త వ్యూహాలను రక్షిస్తుంది. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగినటువంటి ఈటెల రాజేంద్రనాథ్ కొన్ని ఆరోపణలు ఎదుర్కోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి ఈటెల రాజేంద్రనాథ్ అనంతరం బిజెపి పార్టీలో చేరారు.

 

ఇలా బిజెపి పార్టీలో ఉన్న తర్వాత ఈయన బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇలా ఇరువురు ఒకరిపై మరొకరు విమర్శలు కూడా కురిపించుకున్నారు. అయితే నిన్నటి వరకు ఎంతో మౌనంగా ఎవరి వ్యవహారాలు వారు చూసుకుంటూ ఉండగా సడన్ గా ఈటెల సతీమణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన భర్త ప్రాణాలకు ప్రమాదం ఉందని, తనపై హత్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా రాజేంద్రనాథ్ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది అంటే విరుపక్ష నేతలు మౌనం వహిస్తారనే సంగతి మనకు తెలిసిందే. కానీ ఇందుకు భిన్నంగా కేటీఆర్ రంగంలోకి దిగి అందరిని ఆశ్చర్యపరిచారు.ఈటెల సతీమణి తన భర్త ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలియడంతో వెంటనే కేటీఆర్ పోలీస్ యంత్రాంగంతో మాట్లాడి భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలా బిఆర్ఎస్ పార్టీ నుంచి బిజెపిలోకి వెళ్లి తమ ప్రభుత్వంపై విమర్శలు చేసినటువంటి వ్యక్తికి ఇలాంటి భద్రత కల్పించడం ఏంటి అంటూ ప్రశ్నలు తలెత్తాయి.

 

ఈ విధంగా ఈటెలకు భద్రత కల్పించడం అనగా కేసీఆర్ అద్భుతమైన వ్యూహం రచించారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో భాగంగా తిరిగి ఈటేలను తన పార్టీలోకి ఆహ్వానించడం కోసమే కేసీఆర్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అయితే ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్నటువంటి ఈటెల కూడా తన రాజకీయాల పట్ల అసంతృప్తిగా ఉన్నారని దీంతో మూడోసారి కూడా అధికారంలోకి రావడం కోసం ప్రయత్నాలు చేస్తున్న బిఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ఈటేల కూడా ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -