YS Jagan: వామ్మో.. జగన్ ఆలోచనలు మామూలుగా లేవుగా!

YS Jagan: జగన్ వేసే ఎత్తులకి ప్రత్యర్థులు తట్టుకోలేకపోతున్నారు. అడుగడుగునా అడ్డుపడుతూ లేనిపోని సమస్యలు తీసుకువస్తున్నారు. అందులో భాగంగా అందరికీ ఇల్లు పథకం కింద అందుబాటులో ఉండే ధరలతో వాటి నిర్మాణాలు చేపట్టడానికి వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్-5 పేరుతో జోన్ ఏర్పాటు చేసింది.

కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకొని జోన్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది ప్రభుత్వం. దీని ముఖ్య ఉద్దేశం పేదల ఇళ్ల నిర్మాణాలను చేపట్టడమే. ఈ పథకం కింద అన్ని జిల్లాల్లో పేదలకు ప్రభుత్వం పట్టాలను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయా కాలనీల్లో ఇళ్ళ నిర్మాణం శరవేగంగా సాగుతోంది.

 

ప్రత్యర్థులు కొందరు ఏమాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 49 వేల మంది పేద ప్రజలు ఇందులో లబ్ధిదారులు. ఇంతమందికి కారణం అవుతున్న ఈ పథకం ఎందుకు ప్రత్యర్థులు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు అంటున్నారు ప్రభుత్వ వర్గాల వారు.

 

ఇంత పెద్ద మొత్తంలో ఏ ప్రభుత్వము ఇప్పటివరకు ఇంటి స్థలాలు ఇవ్వలేదని భవిష్యత్తులో కూడా అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు అని అంటున్నారు. పేదలకు ఓ నీడ కల్పించే సంకల్పంతో సీఎం జగన్ ముందుకు వెళ్తుంటే అడ్డుకునేందుకు రాజకీయ వర్గ ప్రత్యర్ధులు ప్రయత్నిస్తున్నారు.

 

మే 15వ తారీఖున ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 49,000 మంది పేదలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇళ్ళు పంపిణీ చేయటానికి నిశ్చయించుకున్నారు. ఇంతమందికి ఉపయోగపడుతున్న ఈ పథకం ఎందుకు రాజకీయ ప్రత్యర్ధులు అడ్డుకుంటున్నారు అక్కడ ఎవరు ఉండాలని వారి ఉద్దేశం అనేది అంతుపట్టకుండా ఉంది.రాజధాని ప్రాంతంలో పేదలు ఇల్లు కట్టుకోవడం అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారులు జీర్ణించుకోలేకపోతున్నారు.

 

మరోవైపు రాజధాని ప్రాంతంలో పేదలకు ఇల్లు పట్టాల పంపిణీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఇవేవీ పట్టించుకోని ఏపీ ప్రభుత్వం ఒక్కొక్క లబ్ధిదారునికి ఒక్కొక్క సెంటు చొప్పున స్థలాలు పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఇదే జరిగితే రాజధాని లోనే ప్రజలకు ఇల్లు కేటాయించిన ముఖ్యమంత్రిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి రికార్డు సృష్టించడం ఖాయం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -