Yanamala : అటు కూతురికి ఇటు అల్లుడికి.. టీడీపీలో ఆ రాజకీయ నాయకుడి హవా మామూలుగా లేదుగా!

Yanamala : టిడిపిలో సీనియర్ మోస్ట్ లీడర్ ఎవరు అంటే యనమల రామకృష్ణుడి పేరు తెరపైకి వస్తుంది. ఈయనని రెండుసార్లుగా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీగా గెలిపించుకోవడమే కాకుండా ఆర్థిక మంత్రిగా కూడా పదవి బాధ్యతలను చేపట్టారు. ఇలా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడల్లా యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా కొనసాగి పార్టీకి ఎంతో సహకారం చేస్తున్నారు.

ఇక తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈయన పార్టీ గెలుపు కోసం ఎంత విలువైన సలహాలు సూచనలు ఇస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో యనముడికి కీలక పాత్ర ఉందని చెప్పాలి. ఇకపోతే ఈయన గతంలో మూడుసార్లు తన తమ్ముడు కృష్ణుడికి కూడా టికెట్ ఇప్పించుకున్నారు. ఇకపోతే 2024 ఎన్నికలకు యనమల రామకృష్ణుడు దూరంగా ఉన్నారని తెలుస్తుంది.

ఈ విధంగా యనమల రామకృష్ణుడు ఈ ఎన్నికలలో పోటీ చేయడం లేదని సమాచారం అయితే ఈయనకు బదులు తన కుమార్తె దివ్యకు ఇప్పించారు. అదే టైం లో యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కి మైదుకూరు టికెట్ దక్కింది. ఇది కూడా యనమల ప్రభావమే అని అంటారు

ఇంతకు మించిన మరొక ట్విస్ట్ కూడా ఉందనే చెప్పాలి .ఇలా తన కుమార్తె తమ్ముడు వియ్యంకుడికి మాత్రమే కాకుండా మరో టికెట్ కూడా ఈయన తన కుటుంబానికి ఇప్పించుకున్నారన్న వార్త వైరల్ గా మారింది. యనమల రామకృష్ణుడు తన అల్లుడు మహేష్ యాదవ్ కి ఏలూరు ఎంపీ టికెట్ కన్ ఫర్మ్ అయిందని ప్రచారం సాగుతోంది. గతంలో మహేష్ యాదవ్ నరసారావుపేట ఎంపీ సీటులో పోటీ చేయలనుకున్నారు. కానీ ఈ సీటు వైసిపి నుంచి వచ్చినటువంటి వ్యక్తికి కట్టబెట్టారు దీంతో గత ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నటువంటి మహేష్ యాదవ్ ఈసారి ఎంపీ బరిలో దిగబోతున్నారని తెలుస్తుంది ఇలా ఒకే కుటుంబంలో అల్లుడికి కూతురికి టికెట్లు ఇప్పించుకొని తెలుగుదేశం పార్టీలోనే కీలకంగా మారిపోయారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -