Yatra 2: యాత్ర2 మూవీ బుకింగ్స్ దారుణం.. జగన్ చెప్పినా వైసీపీ నేతలకు లెక్క లేదా?

Yatra 2: యాత్ర2 సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏదైనా సినిమాకు బెనిఫిట్ షో క్రిటిక్స్ కోసం వేస్తారు కానీ, ఈ సినిమాకు మాత్రం బెనిఫిట్ సో పార్టీ నేతల కోసం వేశారు. సీఎం జగన్ ఎమ్మెల్యలందరూ సినిమా చూడాలని ఆదేశించాటర. అయితే, వైసీపీ 150 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. అందులో 60 మందే సినిమా చూడటానికి వెళ్లారని తెలుస్తోంది. మిగిలిన వారు డుమ్మా కొట్టారట. మరి ఎందుకు డుమ్మాకొట్టారో ఎమ్మెల్యేలకే తెలియాలి. ఏదో కారణాల వలన అయితే పర్వాలేదు. కానీ, అధిష్టానం మీద అసంతృప్తితో సినిమాకు వెళ్లకపోతే మాత్రం అది వైసీపీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. కాసేపు ఆ విషయాన్ని పక్కన పెడితే.. సినిమాకు వెళ్లడానికే ఇష్టపడని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ మరో ఆదేశాలను కూడా జారీ చేశారట.

 

ప్రజలకు సినిమాను ఉచితంగా చూపించాలని చెప్పరట. ఉచితంగా అంటే థియేటర్ యాజమాన్యాలు ఏమైనా ఫ్రీగా పంపిస్తారా? ఎమ్మెల్యేలే టికెట్లు కొని ప్రజలకు చూపించాలి. అయితే, పార్టీ నేతలు ఈ విషయంపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. చాలా మంది అధిష్టానం ఆదేశాలను పక్కన పెట్టారని టాక్. అందుకే మొదటి రోజు కూడా సగం ఆక్యూపెన్సీ కూడా నిండలేదు. దేనికి పనికిరాని పని అని వైసీపీ నేతలు అధిష్టానంపై విసుక్కుంటున్నారట. నేతల సంగతి అటుంచితే సినిమా ప్రొడ్యూషర్ కు మాత్రం లాస్ అనే టాక్ నడుస్తోంది. తొలిరోజు సగం సీట్లు కూడా నిండకపోతే.. మిగిలిన రోజుల పరిస్థితి ఏంటని ప్రొడ్యూషర్లు తలలు పట్టుకుంటున్నారట.

ఏపీలో ఒకరు కాకపోతే ఒకరైన జగన్ మాట వింటారు. మరి తెలంగాణలో సంగతి అగమ్యగోచరంగా మారిందట. థియేటర్ యాజమాన్యాలకు తిరిగి రెంట్లు కట్టాల్సి వస్తుందని చర్చ నడుస్తోంది. గత ఎన్నికలకు ముందు కూడా యాత్ర సినిమా రిలీజ్ అయింది. అప్పుడు కూడా ఇలాగే సొంత డబ్బుతో టికెట్లు కొని ప్రజలకు ఎమ్మెల్యే అభ్యర్థులు చూపించారు. అప్పుడు అంటే పార్టీ గెలుస్తుందనే ఓ నమ్మకం ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్తితి అలా లేదు. మునిగిపోయే పడవ కోసం ఎందుకు ఈ ఆరాటం అని వైసీపీ నేతలు లోలోపల చర్చించుకుంటున్నారు. అయితే, ఎన్నికల్లో భాగంగా జరిగే ఖర్చేనని కొందరు తీసి పడేస్తున్నారు. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సి అవసరం లేదని అంటున్నారు.

 

ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. త్వరలోనే ఆర్జీవీ వ్యూహం, శపథం సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆర్జీవీ క్రియేటివిటీ అందరికీ తెలిసిందే. సీరియల్ కంటే లాగ్స్ ఎక్కువ ఉంటాయి. బెనిఫిట్ షో తర్వాత ఎవరూ థియేటర్ ముఖాలు చూడరు. అలాంటి ఆర్జీవి వ్యూహం, శపథం రిలీజ్ కి దగ్గర పడుతున్నాయి. హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా ఎమ్మెల్యేలకు ఇలాంటి ఆదేశాలే వస్తాయని ఆందోళన పడుతున్నారు. ఓడిపోతామని తెలిసి కూడా ఎందుకు ఈ ఆర్బాటాలని చర్చించుకుంటున్నారు. వైసీపీ నేతల పరిస్థితి చూసి టీడీపీ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -