YCP: చనిపోయిన వారి ఓట్లను సైతం తొలగించని వైసీపీ.. కుట్ర జరుగుతోందా?

YCP: ఏపీలో ఓటర్ల జాబితాలోని అవకతవకల వ్యవహారం ప్రతీరోజు ఏదో ఒక చోట బయటపడుతోంది. టీడీపీ, వైసీపీ నేతలు ఈసీకి పోటాపోటీగా ఫిర్యాదులు చేశారు. ఈసీ అన్ని పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. అయితే.. ఈ తుది జాబితాలో కూడా చాలా ఫేక్ ఓట్లు ఉన్నాయని టీడీపీ ఆరోపిస్తోంది.

 

సీఎం జగన సొంతం జిల్లాలో దొంగ ఓట్ల వ్యవహారం బయటపడింది. చనిపోయిన వారి ఓట్లు తొలగించకుండా అలాగే కొనసాగిస్తున్నట్టు టీడీపీ నేతలు గుర్తించారు. తుది జాబితాలో రకరకాల భోగస్ ఓట్లు వెలుగులోకి వచ్చాయి. విపక్షాలు పలుసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే, ఈ దొంగ ఓట్ల అంశం ఒక్క జిల్లాకు పరిమితం కాలేదు. నెల్లూరు సిటీలో కొత్త ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున తప్పిదాలు బోగస్ ఓట్లు వెలుగు చూశాయి. దీనిపై మున్సిపల్ కమిషనర్, అధికారులను మాజీ మంత్రి నారాయణ నిలదీశారు. తప్పులను సవరించకపోతే.. కోర్టుకు వెళ్తానని వార్నింగ్ ఇచ్చారు. తన నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో 2265 డబుల్ ఓట్లు, ఐదువేలకు పైగా దొంగ ఓట్లను నారాయణ గుర్తించారు. ఈనెల 15 లోపు ఓటర్ జాబితాను సరిచేయకపోతే.. కోర్టులో తేల్చుకుంటానని చెప్పారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఏం ఉండదులే అనుకుంటే అది అధికారులు పొరపాటే అవుతుందని నారాయణ చెప్పారు.

ఇక తిరుపతిలో గత రెండు నెలలుగా దొంగ ఓట్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ కొంతమంది అధికారులపై వేటు కూడా పడింది. కానీ, దొంగ ఓట్ల అంశం మరోసారి వెలుగు చూసింది. తిరుపతి డివిజన్ పరిధిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఓటర్ జాబితాను పరిశీలించారు. ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. 37, 39 డివిజన్‌లో బోగస్ ఓట్లు ఉన్నట్టు ఆమె ఆరోపించారు. గతంలో దొంగ ఓట్లపై ఫిర్యాదు చేసినా.. పూర్తి ఆధారాలు సమర్పించినా.. అధికారులు వాటిని తొలగించలేదని విమర్శించారు. అధికారులు ఇకనైనా మారాలని సుగుణమ్మ సూచించారు.

 

తుది ఓటర్ జాబితాలో లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఎలక్షన్ కమిషన్‌కు శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ఫిర్యాదు చేశారు. వెంటనే ఓటర్ లిస్ట్ లో తప్పుల్ని సరిదిద్దాలని ఈసీకి లేఖ రాశారు. ఓటర్ కార్డులో పేరు, ఇంటి నెంబర్ లో తప్పులున్నాయని ఫిర్యాదు చేశారు. ఎప్పుడో మరణించిన వారి పేర్లను ఓటర్ లిస్టులో తొలగించలేదని ఈసీ దృష్టికి తీసుకొని వెళ్లారు. కొన్ని చోట్ల అయితే.. మరణించిన వారి పేరుతో ఒకటికి మించి ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఒకే డోర్ నెంబర్ తో వందలాది ఓట్లు ఉన్నట్లు గుర్తించానని ఆయన అన్నారు. ఇలా ప్రతీ చోట దొంగ ఓట్ల వ్యవహారం బయటపడుతోంది. దీంతో ఎన్నికలకు కచ్చితమైన లిస్ట్ వస్తుందా? లేదా అనేది తేలాలి

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -