Jagan: జగన్ వైఖరితో ఖాళీ అవుతున్న వైసీపీ…!

Jagan: జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి కూడా తన వైఖరితో ముందుగా వ్యవహరిస్తారని వాదన ఉంది. పార్టీలో సీనియర్లకి గౌరవం ఇవ్వరు, మర్యాదగా మాట్లాడరు పేరు పెట్టి పిలుస్తారు, లేదా నువ్వు అని పిలుస్తారని చాలామంది నేతలు బయట చెప్పారు. ఇదే విషయాన్ని నరసాపురం ఎంపీ రఘురాం కృష్ణంరాజు కూడా తెలిపారు. అలాగే కొందరు పైన చేయి చేసుకున్నారని వాదన కూడా వచ్చింది.

 

తాజాగా ఇదే మొండి వైఖరితో ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది. 2024 లో ఎలాగైనా మళ్ళీ అధికారం చేపట్టాలని జగన్మోహన్ రెడ్డి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో ఇన్చార్జిలను మార్చేసి కొత్తవారిని నియమిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం లోకి పిలిపించుకుని ఎమ్మెల్యేలతో మాట్లాడతానని చెప్పి కనీసం వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. సీటు దక్కని వారితో వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డిలతో మాట్లాడి పంపించేస్తున్నారు.కనీసం ఒక్కసారి జగన్ మోహన్ రెడ్డిని కలవాలని చెప్పిన కూడా వారికి అపాయింట్మెంట్ ఇప్పించడం లేదు.

మరోపక్క ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా అభ్యర్థులు ఎంపికల్లో కసరత్తు చేస్తున్నారు. అయితే సీటు దగ్గర అభ్యర్థులను పిలిపించి మాట్లాడుతున్నారు. సీటు ఇవ్వక పోవడానికి గల కారణాలను కూడా క్షుణ్ణంగా వివరిస్తున్నారు. విజయవాడ ఎంపీ సీటు కేశినేని నానికి ఇవ్వడం లేదని చంద్రబాబు ఆయనకి వివరించారు. కేశినేని నాని కూడా దీనిపై స్పందిస్తూ తమ అధినాయకుడు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చాలా పద్ధతిగా మాట్లాడారు. భవిష్యత్తులో తగిన న్యాయం చేస్తామని కూడా చెప్పారట.

 

జగన్మోహన్ రెడ్డి కూడా సీటు ఇవ్వని వారిని పిలిపించి ఎలా కూర్చోబెట్టి మాట్లాడితే ఎటువంటి గొడవ ఉండదు. అలా కాకుండా అవసరం తీరిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు అందరిని వదిలేసి ఇప్పుడు మరీ కొత్త వారి కోసం వెతుకులాట ప్రారంభించడం ఎంతవరకు కరెక్ట్ అని సీటు దక్కని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్టు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది పార్టీ నిర్ణయం సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం. కానీ అది చెప్పడంలోని అసలు విషయం ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -