Roja: వైసీపీ ఎమ్మెల్యే రోజాకు 2024 ఎన్నికల్లో టికెట్ లేదట.. మళ్లీ ఆమెకు సినిమాలే ఆప్షన్ కానున్నాయా?

Roja: వైసీపీ పై పై బ్రాండ్ మంత్రి రోజా గురించి మనందరికీ తెలిసిందే. తరచూ టీడీపీ జనసేన పార్టీ లపై సంచులను వాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సీఎంపై ఈగ కూడా వాలనివ్వకుండా ఎవరైనా జగన్ పై వాక్యాలు చేసే వారికి తనదైన శైలిలో స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ ఉంటుంది ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రోజాకు 2024లో టికెట్ లేదా రోజాకు మళ్ళీ సినిమాలే ఆప్షన్ కానున్నాయా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలపై మాటలు తూటాలు పేల్చే రోజాకు సొంత పార్టీలోనే అసమ్మతి సెగ చాలాకాలంగా తగులుతోంది. నగరిలో మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే శాంతి రోజాకు వ్యతిరేకంగా చాలా కాలంగా నిరసన గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే.

ఇక, మంత్రి పెద్దిరెడ్డితో పాటు నారాయణస్వామితో కూడా రోజాకు పెద్దగా పొసగడం లేదు అన్న టాక్ కూడా ఉంది. అయితే, గత రెండు సార్లు రోజాను గెలిపించేందుకు కృషిచేసిన నియోజకవర్గ స్థాయి నేతలు ఈ సారి తిరుగుబాటు చేయడంతో రోజా మౌనంగా ఉంది. నగరిలో కేజే శాంతి, పుత్తూరులో అమ్ములు, నిండ్రలో చక్రపాణి రెడ్డి, విజయపురంలో రాజు, వడమాలపేటలో మురళి రెడ్డి వంటి నేతలు మంత్రి రోజాపై అసమ్మతి గళం వినిపిస్తుండటంతో వైసీపీ అధిష్టానం కూడా ఇరకాటంలో పడింది. నగరిలో రోజా కుటుంబసభ్యుల ప్రమేయం బాగా ఎక్కువ అయ్యిందని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే, తాము రోజాకు వ్యతిరేకంగా మారామని చెబుతున్నారు.

 

అయితే, అసమ్మతి నేతలకు సహకరిస్తే సస్పెండ్ చేస్తామని పార్టీ అధిష్టానం బెదిరించినా వారి వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇటీవల నగరిలో జగన్ పర్యటన సందర్భంగా కూడా ఈ అంతర్గత విభేదాలు రోడ్డుకెక్కాయి. నగరిలో జగన్ కు స్వాగతం చెబుతూ కట్టిన భారీ ఫ్లెక్సీలలో మంత్రి రోజా ఫోటో లేకపోవడంతో ఈ విషయం బట్టబయలైంది. అదే ఫ్లెక్సీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటో ఉండడం రోజాకు మింగుడు పడటం లేదని తెలుస్తోంది. మంత్రి రోజా ఆధ్వర్యంలోనే ఈ సభ జరగడంతో ఐదు మండలాల వైసీపీ ఇన్చార్జిలు జన సమీకరణకు దూరంగా కూడా ఉన్నారట. దీంతో, జన సమీకరణకు కూడా రోజానే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చిందట. అయితే సాక్షాత్తు జగన్ శాంతి, రోజాలు కలిసి పనిచేయాలని సూచించినా వారిద్దరూ ఎడమొఖం పెడమొఖంగా ఉండటం సంచలనం రేపింది. ఇద్దరు చేతులను పట్టుకొని జగన్ కలిపే ప్రయత్నం చేయగా బలవంతంగా షేక్ హ్యాండ్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో, నగరిలో ఈ ఇద్దరు మహిళల మధ్య వార్ ఏ స్థాయిలో ఉందో జగన్ కు కూడా ప్రత్యక్షంగా అర్థమైంది. నగరి పర్యటన సందర్భంగా ఈ నేతల మధ్య జగన్ రాజీ చేస్తారని అంతా అనుకున్నారు. అయితే, ఆయనకే సాధ్యం కాకపోవడంతో ఇరు వర్గాలలోని కేడర్ అయోమయంలో పడ్డారట దీంతో, రాబోయే ఎన్నికలలో రోజాకు టికెట్ ఇస్తారా లేక ఎమ్మెల్సీ కోటాలో సర్దుబాటు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -