YSR Congress Party: చేసేది పావలా పని.. చేసుకునేది ముప్పావలా ప్రచారం.. వైసీపీ పాలన అసలు నిజాలివే!

YSR Congress Party: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులను ఏడాదిలోపే పూర్తి చేస్తాము అంటూ అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రగల్బాలు పలికిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా పెద్ద ఎత్తున ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గత నాలుగు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు అయితే ప్రస్తుతం ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో పనులన్నీ తామే పూర్తి చేశామని హడావిడిని మాత్రం పెద్ద ఎత్తున చేస్తున్నారు.

జిల్లా వాసుల ఆశల సౌధం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు నిర్మాణం పశ్చిమ ప్రాంత వాసులకు శ్వాసగా మారింది ఎప్పుడెప్పుడు ఈ నిర్మాణం పూర్తి అవుతుందా తమ ప్రాంతానికి నీళ్లు వస్తాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు అయితే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు పనులను దాదాపు 80 శాతం పూర్తి చేసింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన 20 శాతం పనులను కూడా పూర్తి చేయడానికి నాలుగు సంవత్సరాల కాలం పట్టింది.

ఇప్పటివరకు ఈ ప్రాజెక్టులను ఏమాత్రం పట్టించుకోనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో అంతా తామే చేసాము అంటూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు అక్కడ చేసింది పావలా పని అయినప్పటికీ ప్రచారం మాత్రం ముప్పావల రేంజ్ లో చేసుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుంది.

ఈ ప్రాజెక్టు ద్వారా 30 మండలాలలో4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అలాగే 15 లక్షల మంది జనాభా కు తాగునీరును అందించే వెసులుబాటు ఉంటుంది అయితే ఇన్ని రోజులపాటు ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తి చేసింది ఇక మిగిలింది ఈ ప్రాజెక్టు నిర్మాణంలో రెండు సొరంగాలు తవ్వడానికి వైసీపీ ప్రభుత్వానికి నాలుగు సంవత్సరాలు సమయం పట్టింది.

శ్రీశైలంలోని కృష్ణా జలాలను తరలించడానికి భూగర్భన దోర్నాల మండలం కొత్తూరు నుంచి కొల్లం వాగు వరకు సుమారు 18.89 రెండు సమాంతర సొరంగాలను తోవాల్సి వచ్చింది. మొదటి సొరంగం ఏడు రెండవ సొరంగం 9.2 మీటర్ల వ్యాసంతో తవ్వాల్సి ఉంది అయితే గత ప్రభుత్వం 11.586 కిలోమీటర్ల తవ్వారు కేవలం మిగిలింది2.883 కిలోమీటర్లు మాత్రమే వైకాపా ప్రభుత్వం ఈ పనులను పూర్తి చేసిందని ఈ మాత్రం దానికి అంతా తామే చేసాము అని గొప్పలు చెబుతూ ఈ నెల ఆరవ తేదీ దోర్నాల మండలం దగ్గర పైలా నిర్మాణానికి కూడా సిద్ధమయ్యారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -