Ambati Rambabu: లోకేశ్ గురించి అంబటి కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!.

Ambati Rambabu: తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. జగన్ కు భయం అంటే ఏంటో పరిచయం చేస్తాను అంటూ సంచలన వాఖ్యలు చేశారు నారా లోకేష్. నరా లోకేష్ చేసిన వ్యాఖ్యలు కాస్త ఏపీలో హాట్ టాపిక్ గా మారడంతో తాజాగా లోకేష్ వాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ గర్జిస్తే లోకేష్ లాగులో పోసుకోవాలి అంటూ స్ట్రాంగ్ గా కౌంటర్లు వేశారు.

తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి రచించిన అల్లుడు సుద్దులు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అంబటి ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కి పట్టిన శని లోకేష్‌ అని, లోకేష్‌ పేరు మీద టీడీపీ గంగలో కలిసిపోతుందని ఎద్దేవా చేశారు. లక్ష్మీ పార్వతి భుజంపై తుపాకీ పెట్టి ఎన్టీఆర్ ను బాబు కాల్చేశారని ఆరోపించారు. చంద్రబాబు పూర్తి నిజస్వరూపం లక్ష్మీపార్వతికి తెలియకపోయినా ఆయన బావమరిదికి తెలుసంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. బంధుత్వాలను, డబ్బును వాడుకుని రాజకీయాల్లోకి చంద్రబాబు వచ్చారని ఆరోపించారు. ఎన్టీఆర్ భోళాశంకరుడని, ఎవరిని నిలబెట్టైనా గెలిపించగల సమర్థుడని, ఆ లక్షణం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి నుంచి జగన్‌ కు వచ్చిందని వెల్లడించారు.

 

అధికారం కోసం బాబు ఎవరితో అయినా కలుస్తాడని, ఆయన దత్తపుత్రుడు కూడా అందరితో కలిశాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి పవన్ నానా గడ్డి కరుస్తున్నాడని సెటైర్లు వేశారు. ఏదోలా ప్యాంటు షర్డు వేసి లోకేష్ ని సీటులో కూర్చోబెట్టాలని చంద్రబాబు చూస్తున్నాడని అంబటి ఎద్దేవా చేశారు. లోకేష్ తో చేరి దత్తపుత్రుడు పాడైపోతున్నాడని, రోజుకు 2 కోట్లు సంపాదించే పవన్ ట్యాక్స్ కడుతున్నాడో లేదో? అని అనుమానం వ్యక్తం చేశారు. మావాడు సీఎం అవుతాడనని మా కులపోళ్లు అనుకుంటున్నారని, కానీ, పవన్ నాశనం అవ్వడమే కాకుండా సినిమా పిచ్చితో ఉన్న యువకులను నాశనం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -