YS Jagan: జగనన్న పంచుడు కాదు దంచుడు.. ఐదేళ్లలో ఏపీ ప్రజలపై ఇంత భారం పడిందా?

YS Jagan: లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో వేశామని వైసీపీ అధినేత జగన్ తన ప్రచార సభల్లో చెబుతున్నారు. అభివృద్ధి అనే మాటే లేదు. ఇది అభివృద్ది చేశాం. ఇన్ని కంపెనీలను తీసుకొని వచ్చాం. ఇంత మందికి ఉపాధి కల్పించామని చెప్పుకునే పరిస్థితి లేదు. ఉద్యోగాలు అంటే ఐదు వేలు ఇచ్చి ఊడిగం చేయించుకునే వాలంటీర్లనే ఉద్యోగాలు అని చెబుతున్నారు. అంతకు మించి అభివృద్ది గురించి వైసీపీ నేతలు సైతం చెప్పే పరిస్థితి లేదు. కానీ.. సంక్షేమాని కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అని చెబుతున్నారు. లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో వేశానని చెబుతున్నారు.ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి మరో చేత్తే వంద రూపాయలు తీసుకుంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలోనే ద్రవ్యోల్భణం ఎక్కువగా ఉంది. ఇంత జరుగుతున్నా.. తనదైన శైలిలో వడ్డిస్తున్న పన్నులు మాత్రం తగ్గించడంలేదు.

ఈ ఐదేళ్లలో ఏకంగా ఆరుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి.. జనంపై అధనంగా రూ. 18,817 కోట్ల రూపాయల భారం వేశారు. జగన్ ప్రభుత్వం అంచనాల బట్టి మరో రూ.12,491 కోట్లు భారం ప్రజలపై పడాల్సి ఉంది. కానీ, ఎన్నికలు ఉన్నాయి కనుక చిన్న గ్యాప్ తీసుకున్నారు. ఒకవేళ మరోసారి అధికారంలోకి వస్తే.. జగన్ స్టైల్ ఆఫ్ సంక్షేమంలో భాగంగా రూ.12,491 కోట్లు భారం వేయనున్నారు. రేషన్‌ దుకాణాల్లో 2020 జులై నుంచి కందిపప్పు సరఫరాను సగానికి తగ్గించారు. అంతేకాదు.. మిగిలిన సగాన్ని కూడా కిలో రూ. 40 నుంచి రూ.67కు పంపేశారు. మరోవైపు పంచదార రేటు కిలోకు ఏడు రూపాయలు పెంచేశారు. దీంతో.. కోటి 23 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులపై పంచధార, కందిపప్పుపై అధనంగా రూ.8500కోట్లు భారం మోపారు. కేరళలో 2136 సహకార సంఘాల తోడ్పాటుతో ధరల నియంత్రణకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. కానీ.. ఏపీ సీఎంకు మాత్రం ప్రజల కష్టాలను తీర్చడం కోసం ఆలోచించే సమయం కూడా లేదు. అంతేకాదు.. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలపై చెత్తపన్ను వేసిన సీఎం ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ జగన్.

నవరత్నాల పేరుతో వందలసార్లు బటన్‌ నొక్కి నేరుగా ప్రజల ఖాతాల్లోకి నిధులు జమచేశాననని చెబుతున్నారు. కానీ.. జగన్ వేస్తున్న పన్నులు, పెంచిన ఛార్జీల ద్వారా ప్రభుత్వానికి లక్షా ఎనిమిది వేలకోట్ల రూపాయలకు ఆధాయం వచ్చింది. అంటే అదే సొమ్మును జగన్ మళ్లీ నవరత్నాల పేరుతో పంచి పెడుతున్నారు. ఎవరికి ఏం చేస్తే ఓట్లు వేస్తారనే ఆలోచన తప్ప జగన్ కు.. అసలు ఓటర్లు అంటే ఆయన లాంటి మనుషులు అనే ఆలోచనే లేదు. అందుకే.. పెట్రోల్, డీజిల్ పై మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ ట్యాక్సులు విధించడం వలన అధనంగా వినియోగదారులకు రూ. 20వేల కోట్లు నష్టం జరిగింది. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. డొక్కు బస్సులతో కాలం గడిపేస్తున్నారు. ఆ మాత్రం దానికి మూడు సార్లు ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.5,243 కోట్ల రూపాయల భారం మోపారు. ఇంతా చేసిన ఏమైన రోడ్లు బాగుచేశారా? అదీ లేదు. చంద్రబాబు హయాంలో ఉన్న ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి.. ఇసుకను అందుబాటులో లేకుండా చేశారు. ఏకంగా ఇసుక కోసం పెద్ద మాఫియానే తయారు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -