Jagan Bus Yatra: జాతీయ రహదారులపై బస్సు యాత్ర ప్లాన్ చేసుకున్న జగన్.. రోడ్ల పరిస్థితి తెలిసి ఇలా చేశారా?

Jagan Bus Yatra: వైసీపీ అధినేత జగన్ సిద్దం పేరుతో నాలుగు బహిరంగ సభలు నిర్వహించారు. బహిరంగ సభలకు ప్రజలను తరలించడానికి వైసీపీ నేతలు తీవ్రంగా కృషి చేశారు. ఆఫర్లు, ప్రలోభాలు, బెరిరింపులు, డబ్బు, మద్యం, చికెన్ భోజనం, ఇలా ఒకటా రెండా చాలానే చేశారు. అయితే, ఇన్ని చేసి కూడా ఒకటి అంటే.. ఒక హామీ కూడా ప్రజలకు ఇవ్వలేదు. రైతు రుణమాఫీ ప్రకటన చేస్తారని ప్రజలు భావించారు. స్థానిక వైసీపీ నేతలు కూడా ప్రజలకు క్షేత్ర స్థాయిలో ఇదే విషయాన్ని చెప్పారు. నిజానికి రాప్తాడు సిద్ధం సభలోనే ఇలాంటి ప్రకటన ఉంటుందని అనుకున్నారు. కానీ, జగన్ మాత్రం ప్రకటించలేదు. తర్వాత సిద్దం చివరి సభలో కూడా ఆశగా ఎదురు చూశారు. డ్వాక్రా రుణ మాఫీ, రైతు రుణమాఫీ హామీ ఉంటుందని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. దీంతో ప్రజల్లో ఒక నిరాశ, నిస్పృహలు చోటు చేసుకున్నాయి. ఇక వైసీపీ సభలకు ప్రజలు హాజయ్యే పరిస్థితి లేనట్టు తయారైంది.

ఇంతలోనే వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎన్నికల కోడ్ రిలీజ్ అయింది. షెడ్యూల్ విడుదలకు, ఎన్నికలకు ఏకంగా 50 రోజుల పైనే సయమం ఉంది. ఈ సమయాన్ని ఎన్నికల ప్రచారానికి ఎలా వాడాలని వైసీపీలో అంతర్మథనం మొదలైంది. సిద్దం సభల్లా బహిరంగ సభలు నిర్వహిస్తే ఎవరూ వచ్చే ప్రసక్తే లేదు. అందుకే.. జగన్ బస్సు యాత్రను ప్లాన్ చేస్తున్నారు. అయితే.. బస్సు యాత్రతో కూడా మరో పెద్ద తలనొప్పి వచ్చి పడింది. రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి అత్యంత దయానీయంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ రోడ్లపై బస్సుయాత్ర నిర్వహిస్తే ఇక అంతే సంగంతి. ప్రజలు జగన్ ను ప్రత్యక్షంగా నిలదీసే అంత దైర్యం చేయకపోవచ్చు. కానీ.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. ఈ అద్బుతమైన రోడ్లపై జగన్ బస్సుయాత్ర అని ఇప్పటికే టీడీపీ అనుకూల సోషల్ మీడియా ప్రచారం మొదలు పెట్టారు.

జగన్ సీఎం అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్లింది లేదు. ఒకవేళ ప్రభుత్వం కార్యక్రమాల కోసం వెళ్లినా.. హెలికాప్టర్ పై ఆ ప్రాంతానికి వెళ్లి కార్యక్రమం పూర్తి చేసుకొని వచ్చేయడమే. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితిలు ఏంటీ అనేది జగన్ కు తెలిసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయనకు రోడ్లు ఎలా ఉన్నాయో.. క్లియర్ గా తెలుస్తుంది. ప్రజలు కాకపోయినా రోడ్లను చూపిస్తూ ప్రతిపక్షాలు జగన్ ను అడ్డుకునే అవకాశం లేకపోలేదు. దీంతో వైసీపీ ఓ అద్భుతమైన ప్లాన్ వేసింది. అదే రాష్ట్ర రహదారులపై కాకుండా.. జాతీయ రహదారులపై బస్సుయాత్రను ప్లాన్ చేస్తున్నారు. జాతీయ రహదారులను దాటుకొని రాష్ట్ర రాహదారులపైకి వెళ్లాల్సి వస్తే.. అప్పటికప్పుడే రోడ్లు వేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకూ బస్సు యాత్ర ప్లాన్ చేస్తున్నారు. ఇలా చేస్తే రాష్ట్రంలోని అన్ని నియోజవర్గాలు కవర్ అవుతాయని వైసీపీ భావన. దాదాపుగా ఇరవై కోట్లతో ఆర్టీసీ కొనుగోలు చేసిన బస్సును అద్దెకు తీసుకుని యాత్రకు రెడీ అవుతున్నారు. ఆ బస్సు పొరపాటున ఎక్కడైనా ఆగిపోతే మాత్రం.. ఇక అంతే సంగతి.. రోడ్లపై కంటే.. సోషల్ మీడియాలోనే జగన్ బస్సు యాత్ర కనిపిస్తుంది. ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయ్యి పరువు పోతుంది. మొత్తానికి బస్సు యాత్ర అనేది రిస్క్ అయినప్పటికీ.. ఎన్నికలకు చాలా టైం ఉండటంతో తప్పడం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -